పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దుమ్మురేపుతున్నాడు. ఆయన నటించిన రాధేశ్యామ్ సినిమాను రిలీజ్ కు రెడీ గా ఉంచగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సలార్ సినిమా షేరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కే జి ఎఫ్ తో దేశం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను మరో రేంజ్ లో తెరకెక్కిస్తుండగా శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్.