మెగా కుటుంబానికి పవన్ కు మధ్య కొంత దూరం ఉన్నా మెగా యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ లు ఎప్పుడూ తాము నటించే సినిమాలలో పవన్ నామస్మరణ ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈవిషయంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అందరి మెగా హీరోల కంటే ముందు వరసలో ఉంటాడు. 

ఇక రామ్ చరణ్ అయితే తాను పవన్ తో నటించడానికి సిద్ధoగా ఉన్నాను అంటూ ఇప్పటికే అనేక సార్లు సంకేతాలు ఇచ్చాడు. ఇటువంటి పరిస్థితులలో పవన్ లేటెస్ట్ గా డాలీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో మెగా యంగ్ హీరోలు చిన్న అతిథి పాత్రలలో నటించే అవకాశాన్ని పవన్ తిరస్కరించి నట్లుగా గాసిప్పులు  వినిపిస్తున్నాయి. 

ఆశక్తికరమన ఈ న్యూస్ వివరాలలోకి వెళ్ళితే డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో కథరీత్యా ఇందులో ముగ్గురు  యంగ్ హీరోలు కనిపించాల్సిన అవసరం ఉందట. ఆ యంగ్ హీరోలుగా మెగా యంగ్ హీరోలలో ఏ ముగ్గురుతో అయినా నటింప చేస్తే బాగుటుందని దర్శకుడు డాలీ  ఈమధ్య పవన్ కు సూచించి నట్లు టాక్. కానీ పవన్ మాత్రం తన ఫ్యామిలీలోని కథానాయకులు కాకుండా ఇతర  యంగ్ హీరోలని చూడమని చెప్పినట్టు తెలుస్తోంది. 

దీనితో చేసేది లేక  దర్శకుడు డాలీ ఇప్పుడు ఆపాత్రలకి తగ్గ యంగ్ హీరోల అన్వేషణలో ఉన్నట్లు టాక్. ఈ న్యూస్ ఇలా బయటకు రావడంతో పవన్ కు తన అన్న చిరజీవితో మాత్రమే కాకుండా మిగతా మెగా యంగ్ హీరోలతో కూడ దూరం ఉండాలని భావిస్తున్నాడా ? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇలా  ఉండగా పవన్  నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం అవుతోంది. ఈసినిమాను   ఎత్తి పరిస్థితులలోను నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని పవన్ భావించడమే కాకుండా ఈసినిమా చిత్రీకరణ విషయంలో దర్శకుడు డాలీకి పూర్తి స్వేఛ్చ ఇస్తానని పవన్ మాట ఇచ్చినట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: