
తెలుగు వాళ్లందరూ ఎమ్మెల్యే రోజా అంటే కనుక్కోవడానికి కాస్త ఆలోచిస్తారేమో కాని జబర్ధస్త్ రోజా అంటే మాత్రం ఠక్కున కనుగొంటారు. కేవలం జబర్థస్త్ వల్ల రోజా చాలా పాపులర్ అయిందని చెప్పవచ్చు. 90లో ఒక తారగా జనాలలో క్రేజ్ సంపాదించిన తరువాత రాను రాను ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. ఇంక క్యారెక్టర్ పాత్రలు చేస్తున్నప్పటికీ అవి ఆమెకు ఒక నటిగా మంచిపేరును సంపాదించిపెట్టలేదు. అలాంటి తరుణంలో జబర్థస్త్ అనే కామెడీ షోలో జడ్జీగా వ్యవహరించడానికి అవకాశం రావడం, ఆమె ఆఫర్ ను ఒప్పేసుకోవడంతో జనాలలో మునుపటి క్రేజ్ సంపాదించింది.
ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే అవడానికి కారణం కేవలం జబర్థస్త్ అని చెప్పింది. చాలా మందికి ఇది అతిశయోక్తి అనిపించినా ఒకసారి విశ్లేషించి చూస్తే అది నిజమని చెప్పవచ్చు. ఎందుకంటే రోజా అంటే జనాలు మరిచిపోతున్న టైములో జబర్థస్త్ తన పాపులారిటీని మరింత పెంచిందని చెప్పవచ్చు . ప్రస్తుతం ఎమ్మెల్యే గా నగరి నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తూ అధికారపక్షాన్ని పదునైన మాటలతో చెడుగుడు ఆడుకుంటుంది. ఇలాంటి రోజాపై ఒక దర్శకుడు సంచలన వాఖ్యలు చేసాడు. వర్మ తీసిన జీఎస్టీ కి రెండవ పార్ట్ తీసి అందులో రోజాను హీరోయిన్ గా పెడతానని వివాదాస్పద వాఖ్యలు చేశాడు.
వివారాల్లోకెళితే హైదరాబాద్ లో జరిగిన భూత్ బంగ్లా అనే సినిమా ఆడియో ఫంక్షన్ లో ఆ సినిమా డైరెక్టర్ అజయ్ కౌండిన్య మాట్లాడుతూ వర్మ జీఎస్టీ అనే సినిమా తీసాడని, నాకు ఎమ్మెల్యే రోజా గారు అవకాశం ఇస్తే ఆమెను హీరోయిన్ గా పెట్టి జీఎస్టీ రెండవ పార్టు తీస్తానని వివాదాస్పద వాఖ్యలు చేసాడు. అలా ఎందుకన్నాడో వివరిస్తూ రోజా ప్రపంచంలో గల అన్ని విషయాల గురించి మాట్లాడుతుంది కానీ ఆమెకు సినిమా వాళ్ళ కష్టాలు మాత్రం కనపడవు. సినిమావాళ్లను పట్టించుకోవలసిందిగా అలా కోరడం జరిగింది అని సమాధానమిచ్చాడు. మరి వీటికి రోజా ఎలా సమాధానమిస్తుందో.