పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ హీరోలలో బెస్ట్ ఫ్యాన్ ఎవరు అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా అందరూ ఏక గ్రీవంగా హీరో నితిన్ పేరే చెపుతారు. పవన్ పేరు చెప్పుకొని తన ఫెయిల్యూర్ రికార్డు లకు బ్రేక్ ఇచ్చి, పవన్ పాటలు, మాటలు తన సినిమా టైటిల్స్ గా మార్చుకొని మళ్ళీ టాలీవుడ్ క్రేజీ హీరోల లిస్టు లో చేరిపోయిన హీరో నితిన్ పవన్ కళ్యాణ్ క్రేజీ మూవీ ‘అత్తారింటికి దారేది’ నైజాం హక్కులను అత్యంత భారీ పారితోషికానికి తన తండ్రి సుధాకర్ రెడ్డి చేత కొనిపించి రికార్డు క్రియేట్ చేశాడు హీరో నితిన్.

అటువంటి నితిన్ కళ్ళు ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్.1 స్థానానికి అతి చేరువలో ఉన్న ప్రిన్స్ మహేష్ పై పడ్డాయి అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి నితిన్ తన సినిమాలకు మహేష్ సినిమా టైటిల్స్ ను, మహేష్ పంచ్ డైలాగ్స్ ను వాడుకోవడం కాదు ఈసారి రూట్ మార్చి సంక్రాంతికి విడుదల కాబోతున్న మహేష్ క్రేజీ మూవీ ‘వన్’ నేనొక్కడినే సినిమాను టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటివరకూ ఎవ్వరు ఆఫర్ చెయ్యని ఫాన్సీ ప్రైస్ కు ఈ సినిమా నైజాం రైట్స్ తన తండ్రి చేత కొనిపించాడు అనే వార్త టాలీవుడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.

ఈ వార్త బయటకు రావడంతో హీరో నితిన్ రూట్ మార్చడా..? లేకుంటే అటు పవన్ ఇటు మహేష్ ఎవరు నెంబర్.1 స్థానంలో కూర్చున్నా తనకు సమస్య లేకుండా వ్యూహాత్మకంగా తన తండ్రి చేత వ్యాపారంలో పావులు కదుపుతున్నాడా..? అనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తూ భవిష్యత్ లో నితిన్ మహేష్ బాబు క్రేజ్ ను కూడా వదలకుండా తన క్రేజ్ పెంపుదల కు వాడుకుంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇద్దరు టాప్ హీరోలతో నితిన్ చేస్తున్న రెండు పడవల ప్రయాణం నితిన్ కు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: