మారిన రాజకీయ పరిస్థుతుల నేపధ్యంలో నందమూరి బాలకృష్ణ రాజకీయపరంగా సినిమాల పరంగా రానున్న రోజులలో మరింత ఎదగాలని చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. జగన్ మ్యానియాను తట్టుకుని హిందూపురంలో ఎమ్.ఎల్.ఏ. గా గెలిచిన బాలయ్య తెలుగుదేశం ఓటమిని లెక్క చేయకుండా ఈమధ్య హిందూపురం వెళ్ళినప్పుడు అక్కడి జనం బాలయ్యకు అపూర్వ స్వాగతం పలకడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
దీనితో బాలకృష్ణ తన సినిమా కెరియర్ ను కొనసాగిస్తూ తన రాజకీయాలను కూడ పదును పెడుతూ భవిష్యత్ పరిణామాలకు సరిపడే విధంగా తనకు తానుగా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకోవడానికి చాల తెలివిగా ఆలోచనలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలకృష్ణను కలిసి చెప్పిన నందమూరి ఫ్యామిలీ మల్టీ స్టారర్ విషయమై ఆసక్తి కనపరిచినట్లు సమాచారం.
తెలుస్తున్న సమాచారం మేరకు ప్రశాంత్ వర్మ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బాలకృష్ణలను ఒకే మూవీలో కనిపించే విధంగా ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ చెప్పినట్లు టాక్. ఈ స్టోరీ లైన్ విన్న బాలయ్య స్పందిస్తూ ఈ స్టోరీ లైన్ ను కళ్యాణ్ రామ్ కు కూడ చెప్పండి అని సలహా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనితో ఇప్పటి వరకు జూనియర్ కళ్యాణ్ రామ్ లతో కలిసి నటించడానికి ఏమాత్రం ఆసక్తి కనపరచని బాలకృష్ణ మారిన రాజకీయ పరిస్థుతులలో తన మనసు మార్చుకున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి అంటూ ఇండస్ట్రీలో వార్తలు హడావిడి చేస్తున్నాయి. అయితే జూనియర్ ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ బందిఖానాలో ఉన్న నేపధ్యంలో ఈ ఆలోచనలు అన్నీ వచ్చే ఏడాది పరిశీలనకు వచ్చే ఆస్కారం ఉంది. అయితే ప్రశాంత్ వర్మ లేటెస్ట్ మూవీ ‘కల్కి’ ఫ్లాప్ అయిన నేపధ్యంలో బాలకృష్ణ ఆలోచనలలో మార్పులు వచ్చినా ఆశ్చర్యం లేదు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి