టాప్ హీరోల సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు ఆసినిమా టైటిల్ కు సంబంధించి కథకు లేకుంటే పాటలలోని పదాలకు సంబంధించి వివాదాలు వస్తూ ఉంటాయి. అయితే ‘సాహో’ కి సంబంధించి ఎవరూ ఊహించని ఒక వివాదం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘సాహో’ కి సహాయ దర్శకులుగా పనిచేసిన కొంతమంది డైరెక్టర్స్ అసోసిషియేషన్ కు ఫిర్యాదు ఇచ్చినట్లు వార్త చాల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్న సుజిత్ దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన కొందరు ఈ ఫిర్యాదు ఇచ్చినట్లు టాక్. 

వాస్తవానికి ఈసినిమాకు తమను సహాయ దర్శకులుగా ముందు తీసుకుని ఆతరువాత కొద్దిరోజులు పనిచేసిన తరువాత తమను తప్పించి ముంబాయ్ నుండి తీసుకు వచ్చిన సహాయ దర్శకుల చేత ‘సాహో’ కు పని చేయించారని దీనితో ఇలాంటి భారీ సినిమాకు పనిచేసే అవకాశం వచ్చి కూడ తమకు పోయింది అనీ అందువల్ల తమకు నష్టపరిహారం ఇప్పించమంటూ కొందరు సహాయ దర్శకులు దర్శకుల సంఘాన్ని అభ్యర్ధించినా ఈమూవీ వెనుక ప్రభాస్ ఉండటంతో కనీసం ఈ ఫిర్యాదు పై విచారణ కూడ చేయలేదని ఫిలిం నగర్ లో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

అంతేకాదు ఈ దర్శకుల సంఘంకు సంబంధించిన ఒక కీలక వ్యక్తి ఏకంగా ఈ ఫిర్యాదు ఇచ్చినా  సహాయ దర్శకులకు ఎదురు క్లాస్ పీకినట్లు టాక్. ౩౦౦ కోట్ల భారీ సినిమా కాబట్టి నిర్మాతలు వారికి అనుకూలంగా అన్ని భాషలు ముఖ్యంగా హిందీ ఇంగ్లీష్ భాషలు వచ్చిన వారిని పెట్టుకుంటారని ఇలాంటి పరిస్థుతులలో చిన్న చిన్న విషయాలను పెద్దదిగా చేసి భారీ ప్రాజెక్ట్ ‘సాహో’ కు నెగిటివ్ ప్రచారం తీసుకు రావద్దు అంటూ రివర్స్ క్లాస్ వేసినట్లు టాక్. దీనితో భారీ సినిమాల విషయంలో ఎవరు ఎన్ని ఆధారాలతో ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వ్యక్తులు ఇండస్ట్రీలో కరువయ్యారు కొందరు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్..   



మరింత సమాచారం తెలుసుకోండి: