నిన్న కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో పవర్ స్టార్ కు అభినందనలు తెలియచేస్తూ అతడి అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసారు. ఇలాంటి పరిస్థితులలో నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ పేరుమీద విడుదల అయిన ఒక ఉత్తరం కలకలం సృష్టించింది. 

తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసిన అభిమానులు అందరికీ పవన్ కృతజ్ఞతలు తెలియచేస్తూ తాను త్వరలో సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నానని దీనికి తన అభిమానుల నుంచి మద్దతు కోరుతున్నాను అంటూ ఆ లెటర్ సారాంశం. ఈ లెటర్ విడుదలైన కొన్ని గంటలకే వైరల్ గా మారడంతో పవన్ అభిమానులు తమ హీరో మనసు మార్చినందుకు వినాయకుడుకి కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు. 

దీనితో జరుగుతున్న విషయాలను గ్రహించిన ‘జనసేన’ సోషల్ మీడియా టీమ్ రంగంలోకి దిగి ఇది పవన్ వ్రాసిన లెటర్ కాదనీ ఎవరో కొందరు ఉత్సాహ వంతులు పవన్ పేరుతో అభిమానులను తప్పు దారి పట్టించడానికి వ్రాసిన ఫేక్ ఉత్తరం అంటూ క్లారిటీ ఇచ్చింది. దీనితో పవన్ అభిమానుల మధ్య జరిగిన హడావిడి కొంతవరకు చల్లారినా అసలు ఇలాంటి ఫేక్ లెటర్ పవన్ పేరుతో ఎవరు ఎందుకు వ్రాశారు అన్న విషయమై లోతైన పరిశోధన జరుగుతోంది. 

వాస్తవానికి పవన్ సినిమా రీ ఎంట్రీ ఖరారు అయిందని పవన్ నటించే లేటెస్ట్ మూవీ షూటింగ్ ఈ నవంబర్ నుండి ప్రారంభం కాబోతోంది అంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీనితో ఈ విషయమై జనం స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పవన్ వీరాభిమాని ఒకరు ఇలాంటి ఫేక్ లెటర్ క్రియేట్ క్రియేట్ చేసి జనం నాడిని పసిగట్టడానికి ప్రయత్నామా అంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. అయితే ఈ విషయమై ఎదో ఒక రహస్యం ఖచ్చితంగా ఉండి ఉంటుంది అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: