ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తనకు బండ్ల గణేష్ కు ఏర్పడ్డ వివాదం పై కొన్ని ఆశ్చర్యకర కామెంట్స్ చేసారు. విజయవాడకు చెందిన తాను చాల మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన విషయాన్ని వివరిస్తూ 1990 ప్రాంతంలో ఉన్నత చదువుల కోసం అక్కడ సరైన ఉద్యోగం దొరకక పోవడంతో కొన్నిరోజుల పాటు టాయెలెట్స్ కడిగి జీవించిన కొన్ని యదార్ధ విషయాలను వివరించి అందరికీ షాక్ ఇచ్చాడు. 

అంతేకాదు ఆ సందర్భంలో తాను వాడిన టి.షర్ట్స్ ఇప్పటికీ గుర్తుగా తన వద్ద ఉంచుకుని తాను ఎంత కష్టపడి పైకి వచ్చానో తన పెళ్ళాలకు ప్రతిరోజు తాను చెపుతూ ఉంటాను అన్న విషయాన్ని తెలియ చేసాడు. ఇదే సందర్భంలో ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్ గా మారిన బండ్ల గణేష్ వ్యవహారం పై స్పందిస్తూ కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. 

తాను గతంలో ‘టెంపర్’ సినిమా కోసం సుమారు 30 కోట్లు అప్పుగా ఇచ్చిన విషయాలను ఇప్పుడు బయటపెడుతూ అప్పట్లో ఎన్టీఆర్ ఇచ్చిన హామీ మేరకు బండ్ల గణేష్ డబ్బులు ఇవ్వకుండానే సినిమాను రిలీజ్‌కు ఒప్పుకొన్న విషయాలను వివరించాడు. అయితే ఆ తరువాత తాను ఎన్నిసార్లు అడిగినా బండ్ల గణేష్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తాను కోర్టు వరకు వెళ్ళవలసిన విషయాలను బయటపెట్టారు. 

అయితే ఈ వ్యవహారంలో ఎవరి మాటలు వాస్తవం అన్న విషయాలను పక్కకు పెడితే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ద్వారా బండ్ల గణేష్ కెరియర్ మంచి టర్న్ తీసుకుంటుంది అని ఊహిస్తున్న పరిస్థితులలో ఈ బ్లాక్ బస్టర్ నిర్మాత్ ఒక పెద్ద ఆర్ధిక వ్యవహారం ఊబిలో కూరుకు పోవడంతో బండ్ల గణేష్ కు ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సస్ అయితే పెద్దగా కలిసి వచ్చే ప్రయోజనం ఉండదు అని అంటున్నారు. అయితే ఊహించని అద్భుతాలు ఏమైనా జరిగితే మళ్ళీ ఈ సంచలన నిర్మాత మళ్ళీ ట్రాక్ లోకి వచ్చే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: