‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ విడుదలకు ఇంకా 50 రోజుల సమయం ఉన్నా  ఈ మూవీ మ్యానియా పెంచడం కోసం హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్డులోని సుదర్శన్ ధియేటర్ వద్ద ఏర్పాటు చేసిన మహేష్ 81 అడుగుల కటౌట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ‘అల వైకుంఠపురములో’ మూవీతో పోటీ పడుతున్న పరిస్థితులలో మహేష్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోవాలి అంటే ఖచ్చితంగా 200 కోట్ల కలక్షన్స్ మార్క్ ను ఈ మూవీ అందుకుని తీరాలి. 

వాస్తవానికి ఇప్పుడు మహేష్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఈ ఫిగర్ చాల సులువు అని భావించినా సంక్రాంతికి విడుదల అవుతున్న బన్నీ సినిమాతో పాటు రజినీకాంత్ కళ్యాణ్ రామ్ ల సినిమాల పోటీని తట్టుకుంటూ 200 కోట్ల కలక్షన్స్ మార్క్ ను చేరుకోవాలి అంటే ‘సరిలేరు నీకెవ్వరు’ కు ఎక్కడా డివైడ్ టాక్ అన్నది రాకూడదు. దీనికితోడు ఈ మూవీ ఓపెనింగ్స్ అద్భుతంగా ఉండాలి.

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మహేష్ మూవీకి చాల ముందుగా ప్రమోషన్ మొదలు పెట్టారు. అయితే ఈ ప్రమోషన్ వ్యవహారంలో మహేష్ మూవీ కంటే బన్నీ ‘సరిలేరు నీకెవ్వరు’ చాల ముందు వరసలో ఉండటంతో మహేష్ ని జరుగుతున్న పరిణామాలు కలవర పెడుతున్నట్లు టాక్. 

దీనితో మహేష్ అభిమానులకు జోష్ కలిగించడానికి ఇంత భారీ కటౌట్ భాగ్యనగరంలో ఏర్పాటు చేసి ఉంటారని అంటున్నారు. ఇప్పుడు మహేష్ తో పోటీ పడుతున్న అల్లు అర్జున్ మహేష్ కంటే మరో రెండు మూడు అడుగులు ఎత్తులో తన ‘అల వైకుంఠపురములో’ మూవీ కోసం మరొక భారీ కటౌట్ ను తన అభిమానులకు జోష్ ను కలిగించడానికి పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనితో మహేష్ బన్నీల మధ్య టీజర్ వార్ తో పాటు కటౌట్స్ వార్ కూడ మొదలైంది అనుకోవాలి..   

మరింత సమాచారం తెలుసుకోండి: