తెలుగు ఇండస్ట్రీలో మకుఠం లేని మహరాజుగా వెలిగిపోయిన నటసార్వభౌములు ఎన్టీఆర్... ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.  సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో ఆయన నటించిన పాత్రలు కేవలం ఆయన కోసమే రూపొందాయా అన్నట్లు ఉండేవి.  రాముడు, కృష్ణుడు మాత్రమే కాదు రావణాసురుడి పాత్రలో కూడా ఆయన నటించి మెప్పించారు.  అలాంటి నటుడిని ఎంతో మంది ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు.  అయితే కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన తెలుగు దేశం పార్టీ స్థాపించి అప్పటి వరకు నిరంకుశంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇచ్చి సీఎం గా పదవీ బాధ్యతలు కొనసాగించారు. 

 

ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చి పల్లెల్లో సైతం రాజకీయాల గురించి మాట్లాడటం మొదలు పెట్టేలా చేశారు.  ఇలా ఎన్నో వినూత్న పథకాలు.. కార్యక్రమాలు చేయడం వల్లనే ఎన్టీఆర్ గొప్ప మనిషిగీ కీర్తింపబడ్డారు.   ఈ విషయాలు అంటుంది ఎవరో కాదు... జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్. గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం జనసేన నేతలతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...ఈ విషయం ప్రస్దావించారు.. పార్టీ పెట్టగానే ఆయనలా అధికారంలోకి రావడం అందరికీ సాధ్యం కాదని, ఆ నాటి పరిస్థితుల కారణంగా ఒక్క ఎన్టీఆర్ కే సాద్యం అయ్యిందని అన్నారు. 

 

ప్రస్తుత సమాజం స్వార్థం దారి పట్టిందని, ఉచితంగా అన్నీ అందిస్తాం అనే మాటలతో రాజకీయ నాయకులు యువశక్తిని నీరు గారుస్తున్నారని అన్నారు. తాను చాలా దూర దృష్టితో జనసేన పార్టీ స్థాపించానని, రాజకీయం అంటే డబ్బు సంపాదన కాదని చెప్పుకొచ్చారు.  ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి చెందలేదని, తమ పార్టీపై ప్రేమతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రజలు తమకు ఓట్లు వేశారని అన్నారు.  ప్రస్తుతం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో కొనసాగుతున్నారని.. అలా చేస్తే ప్రజల మన్నలు తప్పకుండా పొందుతారని అన్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: