హాలీవుడ్‌ గాయని నటి మాండీ మోరే ఒక దశలో యాక్టింగ్ మానేద్దామన్న నిర్ణయం కూడా తీసుకుందట. సూపర్ హిట్ టీవీ షో `దిస్‌ ఈజ్‌ అజ్‌` కు ముందు ఆమె ఈ ఆలోచన చేసినట్టుగా వెల్లడించింది. నటిగా కన్నా గాయనిగానే మోరే ఎక్కువ ఫేమస్. అయితే గాయనిగా ఫుల్‌ ఫాంలో ఉండగానే ఆమె 2015లో సినిమాల్లో నటించేందుకు అంగీకరించింది. ఏ వాక్‌ టు రిమెంబర్‌, బికాజ్‌ ఐ సెడ్‌ సో లాంటి సినిమాలతో నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తరువాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవటంతో బుల్లితెర మీద కెరీర్‌ను ప్రారంభించింది.

 

కానీ మోరే కు బుల్లితెర కూడా పెద్దగా కలిసి రాలేదు. కెరీర్‌ స్టార్టింగ్‌ లో ఈ భామ నటించిన సినిమాలన్ని వరుగాస ఫెయిల్ అయ్యాయి. దీంతో ఇక తన కెరీర్‌ ముగిసినట్టే అని భావించింది మాండీ మోరే. ఇక నటనకు గుడ్‌ బై చెప్పేసి తిరిగి తన వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. తిరిగి ఫ్లోరిడా వెళ్లిపోయిన మరేదైనా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ఆలోచన కూడా చేసింది. ఈ విషయాలను ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది మోరే.


అయితే అదే సమయంలో ఆమెకు దిస్‌ ఈజ్‌ అజ్‌ షోలో అవకాశం వచ్చింది. ఈ షోలో ఆమె పోషించిన రెబెకా పియర్సన్‌ క్యారెక్టర్ ఆమెకు సరికొత్త ఇమేజ్‌ తీసుకువచ్చింది. అంతేకాదు ఎంతో మంది అభిమానులను సంపాదించిపెట్టింది. ఈ సందర్భంగా ఆమె వ్యక్తి గత విషయాలను కూడా మీడియాతో పంచుకుంది. 2009లో రేయాన్‌ ఆడమ్స్‌ను పెళ్లి చేసుకున్న మోరే 2016లో అభిప్రాయ భేదాలతో ఆయన నుంచి విడాకులు తీసుకుంది. అయితే ఈ విభేదాల కారణంగా కూడా ఆమె కెరీర్ కష్టాల్లో పడిందని వెల్లడించింది. అయితే ప్రస్తుతం తాను తన జీవితంలోనే మోస్ట్ కంఫర్టబుల్‌గా ఉన్నానని ఆనందం వ్యక్తం చేసింది మోరే. గతంలో ఎలాంటి ఆంక్షలు లేవని, కెరీర్‌ పట్ల కూడా భయాలు లేవని ఎంతో కాన్పిడెంట్‌గా ఉన్నానని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: