కాకి పిల్ల కాకికి ముద్దట.. అవును మరి! ఇపుడాప్రస్తావన ఎందుకంటారా.. అందులోకి వెళుతున్నాం. ప్రముఖ టాలీవుడ్ హీరో యాంగ్రీ మేన్ గా పిలవబడే రాజశేఖర్ అండ్ జీవితల గారాల పట్టి (చిన్నకూతురు) శివాత్మిక ‘దొరసాని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి అందరికి విదితమే. సినిమా తేడా కొట్టినప్పటికీ.. తొలి సినిమాతోనే తనదైన నటనను కనబరిచారు శివాత్మిక. 

 

IHG

 

రౌడీ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సక్సస్ అవకపోయినా, విమర్శకుల మెప్పు మాత్రం పొందింది. ‘దొరసాని’ పాత్రలో ఒదిగిపోయి విమర్శకుల ప్రశంసలు అందుకున్న శివాత్మిక ఇప్పుడు వేరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి  సిద్ధమవుతున్నారు. యంగ్ హీరో అరుణ్ ఆదిత్, శివాత్మిక జంటగా నటిస్తోన్నఈ చిత్రం పేరు ‘విధి విలాసం’.

 

IHG

 

అయితే, తీరిక సమయాలలో అమ్మడు కాస్త ఫోటోకు పని చెబుతుంది.. ఇటీవల జరిగిన ఫోటో షూట్లో తన నడుము అంద చందాలతో రెచ్చిపోయింది. ఇలియానాకు కుళ్ళుకలిగే రీతిలో వివిధ భంగిమలలో ఫోజులిచ్చిన అమ్మడు అందాలకు సాటి కెమెరా టీమ్ ఫిదా అయిపోయారట.. అదే విషయాన్ని రాజశేఖర్ జీవిత దంపతులు తమ ఇరుగు పొరుగు వారి దగ్గర చెప్పి తెగ మురిసిపోతున్నారట..! 

 

IHG

 

ఫోటో షూట్స్ ఫలమో ఏమో మరి, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్ర ధారులుగా ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని రూపొందించనున్న సినిమాలో అమ్మడుకి ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తుందని వినికిడి. బ్రహ్మానందం డిఫరెంట్ క్యారెక్టర్ చేయనున్న ఈ సినిమాను రెడ్ బల్బ్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్, హౌస్‌ఫుల్ మూవీస్ బ్యానర్స్‌పై.. అభిషేక్ జవకర్, మధు కలిపి నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: