దర్శకుడుగా రాజమౌళి తన కెరియర్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు పరాజయం అన్నపదం ఆయన వినలేదు. ఇక ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళి చేత ఏకంగా ఒకప్రముఖ అంతర్జాతీయ మేనేజ్మెంట్ సంస్థ తమ విద్యా సంస్థలో మేనేజ్మెంట్ మాష్టర్ డిగ్రీ కోర్సును అభ్యసించే విద్యార్ధులకు రాజమౌళి చేత టైమ్ మేనేజ్మెంట్ సక్సస్ మంత్ర పై పాఠాలు చెప్పించింది అంటే రాజమౌళి స్థాయి ఎవరికైనా అర్ధం అవుతుంది. 


అయితే అలాంటి రాజమౌళి ఖ్యాతి ఆయన కుటుంబ సభ్యులకు పెద్దగా కలిసిరావడం లేదా అంటూ ఒక ఆసక్తికర విశ్లేషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రాజమౌళి తీసే ప్రతి సినిమాలో ఆయన కుటుంబ సభ్యులు అంతా బాధ్యతలు పంచుకుంటారు. రాజమౌళి సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తే కొడుకు కార్తికేయ రాజమౌళి కుడిభుజం లా దర్శకత్వ శాఖలో అన్ని పనులు చూసుకుంటూ ఉంటాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తే రమా రాజమౌళి శ్రీవల్లీ లు ఆసినిమా కాస్ట్యూమ్ డిజైనర్స్ గా పనిచేస్తారు. 


ఇలా ప్రతి ఒక్కరు రాజమౌళి మూవీ ప్రాజెక్ట్ లో తమ బాధ్యతను పంచుకుంటూ ఉంటారు. రాజమౌళి సినిమాలతో కథకుడిగా గొప్పపేరు సంపాదించిన విజయేంద్ర ప్రసాద్ బయట తన ప్రతిభను చాటుకోలేకపోతున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన ‘రాజన్న’ దగ్గర నుండి. ఆ మధ్య విడుదలైన ‘శ్రీవల్లి’ సినిమాల వరకు భయంకరమైన ఫ్లాపులుగా మారాయి. ఇక ‘మర్యాదరామన్న’ కు కథ అందించడంతో పాటు రాజమౌళి తీసిన చాల సినిమాలకు రచనా సహకారం అందించిన ఎస్.ఎస్. కాంచి దర్శకుడిగా మారి ‘షో టైమ్’ అనే సినిమా తీశాడు. దాని ప్రోమోలు బాగానే అనిపించాయి కానీ ఆ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. 

 

ఇక రాజమౌళి తన కొడుకును దర్శకుడుగా కాకుండా ఒకప్రముఖ నిర్మాతగా తీర్చి దిద్దాలని కలలు కంటున్నాడు. ఈఉద్దేశ్యంతోనే కార్తికేయను నిర్మాతగా మార్చి ‘యుద్ధం శరణం’ అనే మూవీని తీయిస్తే అది ఘోరమైన ఫ్లాప్ గా మారింది. దీనితో మరొకసారి ప్రయత్నంగా మళ్ళీ కార్తికేయను నిర్మాతగా మార్చి గుణ్ణం గంగరాజు తనయుడు అశ్విన్‌ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘ఆకాశవాణి’ అనే సినిమా మొదలు పెట్టినా ఆసినిమా మధ్యలోనే ఆగిపోయింది అని వార్తలు వస్తున్నాయి. దీనితో రాజమౌళితో పనిచేసిన వ్యక్తులలో ఒక్క కీరవాణికి చాల పేరు వచ్చినా రాజమౌళి దర్శకుడు అవ్వక ముందే కీరవాణి సంగీత దర్శకుడు అయ్యాడు అన్నవిషయం తెలిసిందే. దీనితో రాజమౌళితో పనిచేసిన హీరోల దగ్గర నుండి టెక్నీషియన్స్ వరకు జక్కన్న మ్యానియా ముందు వెలవెల పోతారు అన్న విషయం యదార్ధం అంటూ కొందరు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: