రాజమౌళి గతంలో తీసిన ‘మగధీర’ ‘బాహుబలి’ సినిమాలలోని సీన్స్ అనేక హాలీవుడ్ సినిమాలలోని యాక్షన్ సీన్స్ ను పక్కాగా కాపీ కొట్టాడు అంటూ గతంలో కామెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ కామెంట్స్ పై రాజమౌళి స్పందిస్తూ అనుసరణ వేరు కాపీ వేరు అని చెపుతూ తాను అనుసరిస్తాను కానీ కాపీ కొట్టను అంటూ తన పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ను చాల సమర్థవంతంగా తిప్పి కొట్టాడు. 

బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా రాజమౌళి మారిపోవడంతో అతడు లేటెస్ట్ గా తీస్తున్న ‘రామ రౌద్ర రుదిరం’ పై మళ్ళీ ఎవరు కాపీ కామెంట్స్ చేసే సాహసం చేయరు అని అందరు భావించారు. అయితే మొన్న ఉగాది రోజున విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ మోషన్ పోష్టర్ పై కూడ ఇప్పుడు కాపీ వివాదాలు చుట్టుముడుతున్నాయి.  


‘ఆర్ ఆర్ ఆర్’ మోషన్ పోస్టర్‌ లో రామ్ చరణ్.. అగ్ని నుంచి, ఎన్టీఆర్.. నీటి నుంచి వస్తున్నట్లు చూపించారు. గతంలో అదే రీతిలో ‘మగధీర'లో చెర్రీ నీటి నుంచి.. ‘యమదొంగ'లో తారక్ మంటల నుంచి ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు ఆ విషయాలను గుర్తుకు చేస్తూ రాజమౌళి తన గత సినిమాలోని సీన్స్ ను మళ్ళీ తనకు తానే కాపీ కొట్టుకుంటున్నాడ అంటూ కొందరు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 


మరికొందరైతే ‘ఆర్ ఆర్ ఆర్’ మోషన్ పోష్టర్ ‘ఫైర్ అండ్ ఐస్' అనే హాలీవుడ్ మూవీ పోస్టర్‌ కు కాపీగా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే రకరకాల కారణాలతో ఈ సినిమా నిర్మాణ విషయంలో సమస్యలు ఎదుర్కుంటున్న రాజమౌళికి ఇప్పుడు ఈ మోషన్ పోష్టర్ పై వస్తున్న విమర్శలకు ఎదో విధంగా సమాధానం చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచంలోని సినిమాలు అన్నీ ఇంటర్ నెట్ పుణ్యమా అని అందరికీ అందుబాటులోకి వస్తున్న పరిస్థితులలో రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు కి కూడ ఒక సీన్ ను తీయాలి అంటే చాల కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: