టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భీష్మ సినిమా ద్వారా మంచి హిట్ సాధించాడు. నిజానికి ఈ సినిమా ఇంకా బాగా ఆడాల్సింది. కానీ అప్పటికే కరోనా విజృంభణ స్టార్ట్ అవడంతో బ్లాక్ బస్టర్ కి అడుగుదూరంలో ఆగిపోయింది. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ మధ్యే ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది.

 

అయితే ఇదిలా ఉంటే నితిన్ ఫ్లాప్ చిత్రం యూట్యూబ్ లో దుమ్ము దులుపుతుంది. శతమానం భవతి సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న, దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కించిన శ్రీనివాస కళ్యాణం అందరికీ గుర్తుండే ఉంటుంది. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్ గా కనిపించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆడలేదు.

 

థియేటర్లలో అంతగా ఆడని ఈ సినిమా యూట్యూబ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా హిందీ వెర్షన్ కి ౧౦౦ మిలియన్లు రావడం టాలీవుడ్ జనాలని షాక్ కి గురి చేసింది. సినిమా మొత్తం పెళ్ళి గురించే చూపించిన దర్శకుడు ఈ సినిమాతో ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. అయితే హిందీ ఆడియన్స్ మాత్రం బాగా ఇష్టపడుతున్నారు. ఈ మధ్య తెలుగు డబ్బింగ్ వెర్షన్న్ అన్నింటికీ వ్యూస్ బాగానే వస్తున్నాయి.

 

మాస్ సినిమాలని విపరీతంగా ఇష్టపడే హిందీ ప్రేక్షకులు శ్రీనివాస కళ్యాణం వంటి క్లాస్ సినిమాలని కూడా ఇష్టపడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఒటీటీ ఫ్లాట్ ఫామ్ లతో సరిహద్దులని చెరిగిపోతున్న నేపథ్యంలో ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ ప్రేక్షకులకి సౌత్ సినిమాల పట్ల ఇష్టం కూడా పెరిగింది. అందుకే ఇక్కడ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు సైతం హిందీలో మిలియన్స్ లో వ్యూస్ దక్కించుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: