భారతదేశ సినీ పరిశ్రమలో అత్యంత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సంచలనం అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. తెలుగులో శివ, సత్య, రక్త చరిత్ర, గులాబి, క్షణక్షణం, అనగనగా ఒక రోజు, దయ్యం, మర్రి చెట్టు, రాత్రి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ లో కూడా సర్కార్, షూల్, డర్న మన హై, భూత్, నిశ్శబ్ద్, రంగీలా లాంటి దిమ్మ తిరిగే బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించి వావ్ అనిపించాడు. 

IHG
నవంబర్ 26, 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడి గురించి అందరికీ తెలిసిందే. ఈ దాడిలో మొత్తం 166 మంది మరణించగా 300 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత రాంగోపాల్ వర్మ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలసి తాజ్ హోటల్లో కాస్త సమయాన్ని గడిపారు. అప్పట్లో మీడియా వాళ్ళు మీరు ముంబై ఎటాక్ పై సినిమా చేస్తున్నారా, సర్? అని ప్రశ్నిస్తే లేదు అని సమాధానం ఇచ్చాడు. కానీ ఎవరి ఊహలకు అందకుండా ఐదు సంవత్సరాల తర్వాత తన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ది ఎటాక్స్ అఫ్ 26/11' సినిమా థియేటర్లలో విడుదలైంది. నిజమైన సంఘటన ఆధారంగా తీయబడిన ఈ చిత్రం రామ్ గోపాల్ వర్మ కెరియర్లో చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. 

IHG
నిజ జీవిత సంఘటనల గురించి స్ట్రైట్ గా చూపిస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది. అదే నిజ జీవిత సంఘటనలకు కాస్త డ్రామా, ఎమోషన్స్ జోడించి చిత్రీకరిస్తే అది సినిమా అవుతుంది. భారతదేశ సినీ పరిశ్రమలో 2013వ సంవత్సరం వరకు జీవిత సంఘటనలకు డ్రామా జోడించి తెరకెక్కించిన దర్శకుడు ఎవరు లేరు. కానీ రామ్ గోపాల్ వర్మ మొట్టమొదటిగా ఇటువంటి (docudrama) డాకుడ్రామా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చి అందరి ప్రశంసలను దక్కించుకున్నాడు. ది ఎటాక్స్ అఫ్ 26/11 సినిమాలో ఒకరికి తప్పు ఒకరిది ఒప్పు అని చూపించకుండా రాజకీయ అంశాలను టచ్ చేయకుండా... సాధారణంగా జీవితం సాగిస్తున్న మనలాంటి వారిపై ఉగ్రవాదుల దాడి జరిగితే ఎలా ఉంటుంది అని రాంగోపాల్ వర్మసినిమా ద్వారా చక్కగా చూపించాడు. ఉగ్రవాదుల రాక్షసత్వం, సామాన్య ప్రజల భయం ఒకేసారి చాలా అద్భుతంగా చూపించిన అందుకుగాను సినీ విమర్శకులు సైతం రాంగోపాల్ వర్మ దర్శకత్వానికి ఫిదా అయిపోయి అతడిని గొప్ప గొప్ప దర్శకులతో పోల్చారు. 

IHG
తాను ఇంకా ఎన్నో సరికొత్త సినిమా టెక్నాలజీని భారత ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. తక్కువ(రూ. 2లక్షలు) బడ్జెట్ థ్రిల్లర్ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే చిత్రీకరణ జరిపి ఎడిట్ చేసి రిలీజ్ చేశాడు. ఐస్ క్రీమ్ 1, ఐస్ క్రీమ్ 2 చిత్రాలలోని సన్నివేశాలను తన ఐ ఫోన్ తో చిత్రీకరించి అందరికీ పెద్ద ఝలక్ ఇచ్చాడు. హారర్ చిత్రాలను తీయడంలో రామ్ గోపాల్ వర్మకి ఎవరు సాటిరారేమో. నిజం చెప్పాలంటే తెలుగులో ఏ దర్శకుడు ప్రయత్నించని సరికొత్త జోనర్లలో సినిమాలను చిత్రీకరించిన ఘనత ఒక్క ఆర్జీవి కే దక్కుతుంది. కానీ ఈ మధ్య కాలంలో తాను తీస్తున్న సినిమాలు థియేటర్లలో వారం రోజుల కంటే ఎక్కువగా ఆడడం లేదు. కానీ ఈ మధ్య కాలంలో తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప రెడ్లు, కిల్లింగ్ వీరప్పన్(వీరప్పన్ జీవిత చరిత్ర గురించి ఎక్కువగా చూపించలేదు) లాంటి చిత్రాలు అతడి దర్శకత్వానికి మచ్చలా మారుతున్నాయి. మొన్నీ మధ్య కరోనాపై ఓ పాట విడుదల చేసి తనలో పాత రామ్ గోపాల్ వర్మ లేనట్టు, తన పని ఇక అయిపోయినట్టే అని అందరి చేత అనిపించుకున్నాడు. దీంతో మళ్లీ తాను ఒక మంచి సినిమా తీస్తాడని ఎవరూ నమ్మలేకపోతున్నారు. 

IHG
గాడ్ సెక్సీ అండ్ ట్రూత్ సినిమాని మియా మాల్కోవా తో రాంగోపాల్ వర్మ తెరకెక్కించాడన్న సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ ఆమెతో కలిసి ఈ లాక్ డౌన్ సమయంలో 20 లక్షల రూపాయల తోనే క్లైమాక్స్ మూవీ చిత్రీకరణ పూర్తి చేశాడు. ఆ సినిమాని Shreyas ET అనే ఒక అప్లికేషన్ లో విడుదల చేసాడు. అయితే దాదాపు మూడు లక్షల మంది ఈ సినిమాను చూసేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. దాంతో రూ.20 లక్షలు పెట్టుబడికి 3 కోట్లు వచ్చాయన్నమాట. ఇంకా కొన్ని రోజుల్లో ఈ సినిమాలో మియా మాల్కోవా అందచందాలు చూసేందుకు చాలా మంది రిజిస్టర్ చేసుకుంటారని తెలుస్తోంది. దాంతో తనకి ఎంత లేదనుకున్నా ఐదు కోట్ల రూపాయలు వస్తాయి అని తెలుస్తోంది. తన క్లైమాక్స్ సినిమాల హిట్ అయినా హిట్ కాకపోయినా కోట్ల రూపాయల లాభాలను ఆర్జించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు రామ్ గోపాల్ వర్మ. దీన్ని బట్టి చూస్తుంటే రాంగోపాల్ వర్మ ఎంత తెలియవైన బిజినెస్ మైండెడ్ పర్సనో ఇట్టే అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: