టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తన తల్లి రోజారమణి వలె తాను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన తరుణ్, చిన్నతనంలోనే తన ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారిన తరుణ్, తొలి సినిమాతోనే అత్యద్భుత విజయాన్ని అందుకున్నాడు. వాస్తవానికి ఫస్ట్ సినిమాతో అంత పెద్ద హిట్ కొట్టిన తరుణ్, ఆ తరువాత నుండి తన కెరీర్ ని మాత్రం సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయాడు. 

 

ఆ తరువాత తరుణ్ హీరోగా తెరకెక్కిన నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు వంటి సినిమాలు తప్పించి చాలా వరకు మిగతా సినిమాలేవీ కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. అయినప్పటికీ ఆ తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన తరుణ్ కు, అపజయాలు మరింతగా చుట్టుముట్టాయి. అలానే అదే సమయంలో అప్పటి ఒక యువ హీరోయిన్ తో తరుణ్ కు అఫైర్ ఉందనే వార్తలు పుకారవడం కూడా జరిగింది. ఇక ఆ తరువాత నుండి మెల్లగా సినిమాలు తగ్గిస్తూ వచ్చిన తరుణ్, ఆపై చాలావరకు అక్కడకక్కడ మాత్రమే సినిమాలు చేస్తున్నారు. 

 

ఇక ఇటీవల కొన్నాళ్లుగా తరుణ్, పూర్తిగా బిజినెస్ మ్యాన్ గా మారిపోయారని, తల్లితండ్రుల సూచనతో పలు రకాల బిజినెస్ లు మొదలెట్టిన తరుణ్, ప్రస్తుతం వాటితో పూర్తిగా నిమగ్నమైనట్లు సమాచారం. మరోవైపు ఆయనకు అతి త్వరలో పెళ్లి కూడా చేయాలని తల్లి రోజారమణి భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఫస్ట్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న తరుణ్, ఆపై కనుక కెరీర్ పరంగా మరికొంత జాగ్రత్త పడ్డట్లయితే తప్పకుండా మరింత మంచి సక్సెస్ లు దక్కేవని, అయితే ఒక్కోసారి అన్ని మన చేతుల్లో ఉండవు కాబట్టి, ఆ విధంగా తరుణ్ కెరీర్ మెల్లగా డౌన్ ఫాల్ అవుతూ వచ్చిందని అంటున్నారు సినీ విశ్లేషకులు........!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: