రామానాయుడు వారసుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇండస్ట్రీని ప్రభావితం చేసే ఆ నలుగురు లో ఒకరు గా కొనసాగుతున్న సురేశ్ బాబు ఏ విషయం పై అయినా చాల స్పష్టంగా మాట్లాడుతాడు. సినిమాల నిర్మాణం దగ్గర నుండి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ వరకు అన్ని విషయాలలోనూ అవగాహనతో పాటు పూర్తి పట్టు ఉండే ఈ నిర్మాత సినిమాల బడ్జెట్ విషయంలో తాను ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి చాల ఆచితూచి ఆలోచనలు చేస్తాడు అని అంటారు.


ఈయన లేటెస్ట్ గా తీసిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ మూవీ ఒటీటీ లో రిలీజ్ అయి ఘన విజయం సాధించిన పరిస్థితులలో ప్రస్తుత ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితి పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. అందరు అనుకుంటున్నట్లుగా ఒటీటీ లపై సినిమాలు రిలీజ్ చేయడం అంతసులువు కాదనీ దీనికి ఆర్ధికంగా చాల లెక్కలు ఉన్నాయి అని అంటున్నాడు.


ఒటీటీ సంస్థలలో సినిమాలు తీసి డబ్బులు రాబట్టడం అంత సులువైన పని కాదనీ దీనికి సంబంధించి చాల లెక్కలు ఉంటాయని వ్యూవర్ షిప్ ఆధారంగా అదేవిధంగా సబ్ స్క్రిప్షన్ లను బట్టి ఒటీటీ సంస్థలు సినిమాలకు డబ్బులు ఇస్తాయి అంటూ అలా సినిమాలు తీయడం తనకు రాదు అని అంటున్నాడు. ప్రస్తుతం తాను నిర్మిస్తున్న ‘నారప్ప’ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించడం కష్టం అనీ అభిప్రాయపడ్డాడు.


ఇక రానా పెళ్ళి గురించి మాట్లాడుతూ ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా ఆగష్టు 8న రానా పెళ్ళి జరగడం ఖాయం అని చెపుతూ గతంలో పెళ్ళి అంటే శుభలేఖలు ప్రింట్ చేయించడం దగ్గర నుండి బంధువులను మిత్రులను పిలవడం వరకు ఎంతో హడావిడి ఉండేదని ఇప్పుడు ఈ కరోనా పరిస్థితులు వల్ల ఎటువంటి హడావిడి లేదు అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులలో రానా పెళ్ళికి కనీసం 50 మంది చుట్టాలు అయినా వస్తారో రారో అన్న సందేహాలు తనకు ఉన్నాయని అంటూ ప్రస్తుత పరిస్థితులలో మళ్ళీ సినిమాలు తీస్తాను అన్ననమ్మకం తనకు కలగడం లేదు అంటూ సురేశ్ బాబు కామెంట్స్ చేస్తున్నాడు..   

మరింత సమాచారం తెలుసుకోండి: