ఛలో, భీష్మ సినిమాలతో కథలో పెద్దగా మ్యాటర్ లేకపోయినా సరే ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ వెంకీ కుడుముల తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. కొద్దిరోజులుగా వెంకీ కుడుముల రాం చరణ్ తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ న్యూస్ ను కన్ఫర్మ్ చేస్తూ మెగా కాంపౌండ్ నుండి టాక్ బయటకు వచ్చింది. రీసెంట్ గా వెంకీ కుడుముల రాం చరణ్ ను కలవడం స్టోరీ వినిపించడం జరిగిందట.
ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న రాం చరణ్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. యువ దర్శకుడు వెంకీ చెప్పిన లైన్ నచ్చడంతో అతనితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఛలో, భీష్మ రెండు సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. డైరక్టర్ గా వెంకీ ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే రాం చరణ్ rrr తర్వాత వెంకీతో సినిమా చేయాలని చూస్తున్నాడట.
ఓ పక్క తారక్ మాత్రం ట్రిపుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. త్రివిక్రం, ప్రశాంత్ నీల్ లాంటి క్రేజీ డైరక్టర్స్ ను లైన్ లో పెట్టాడు యంగ్ టైగర్. ఎవరితో మొదట సినిమా చేస్తాడో తెలియదు కాని rrr తర్వాత తారక్ చేసే సినిమా మాత్రం ఈ ఇద్దరిలో ఒకరితో అని తెలుస్తంది. అయితే రాం చరణ్ మాత్రం వెంకీ కుడుములకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ పై అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి