చిన్నతనంలోనే బాలనటుడిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన నీడ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. బాలచంద్రుడు సినిమా అనంతరం తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, తొలి సినిమాతో సూపర్ హిట్ కొట్టి, ఘట్టమనేని అభిమానులను, ప్రేక్షకులను తన ఆకట్టుకునే అందం, నటనతో మెప్పించారు.
అక్కడి నుండి వరుసగా అవకాశాలతో ముందుకు సాగిన మహేష్, మధ్యలో ఎన్నో గొప్ప విజయాలతో పాటు మధ్యలో కొన్ని ఫ్లాప్స్ ని కూడా చవిచూశారు. కెరీర్ లో ఎంతో గొప్ప క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ వాల్యూ సంపాదించిన మహేష్, ప్రస్తుతం టాలీవుడ్ బడా స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. కెరీర్ మొదట్లో కొంత రిజర్వుడ్ గా వ్యవహరించిన మహేష్, రాను రాను తన నడవడిక మార్చుకుని, మెల్లగా తోటి సినిమా ప్రముఖులు, నటులు, అభిమానులను కలుస్తూ, వారితో మమేకమవ్వడం మొదలెట్టారు. ఇక సెట్లో మహేష్ బాబు ఉన్నారు అంటే, సెట్ మొత్తం కూడా మంచి సందడి సందడిగా ఉంటుందని, ఎప్పుడూ నవ్వుతూ, చుట్టుప్రక్కల వారిని నవ్విస్తూ ఉండే మహేష్ బాబుతో ఒక్క విషయంలో మాత్రం జాగ్రతగా ఉండాలని అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు.

ఎవరైనా సరే ఆయనతో కొద్దిసేపు మాట్లాడితే చాలు, ఆయన వెంటనే వారితో కలిసిపోయి చిన్నపిల్లాడిలా జోక్స్ వేస్తుంటారని, అయితే ఎవరైనా తన మీద ఏదైనా జోక్ వేస్తే చాలు, వెనువెంటనే వారిపై మంచి కామెడీ పంచ్ వేస్తారట మహేష్. ఆ విధంగా మహేష్ ఎంతో బాగా అందరితో కలిసిపోయే వ్యక్తి అని, తండ్రి కృష్ణ వలె ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా, ఒదిగి ఉండే మనస్తత్వం గల మహేష్, రాబోయే రోజుల్లో మరింత ఎత్తుకు ఎదగాలని అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు......!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి