నిన్నవిడుదలైన పవర్ స్టార్ మూవీ ట్రైలర్ అత్యంత వివాదాస్పదంగా మారడంతో పవన్ అభిమానులు వర్మను కార్నర్ చేస్తూ అనేక కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ పై మెగా కాంపౌండ్ కు సంబంధించి ఏఒక్క వ్యక్తి స్పందించక పోవడంతో ఈ మూవీ విషయాన్ని వ్యూహాత్మకంగా మెగా కాంపౌండ్ ఇగ్నోర్ చేస్తున్నట్లు భావన కలుగుతోంది. 


ఈవిషయాలను పట్టించుకోకుండా వర్మ తన మూవీ ప్రమోషన్ విషయంలో మరింత దూకుడు పెంచాడు. నిన్నరాత్రి ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకంటే పవన్ కళ్యాణ్ ను అభిమానించే వ్యక్తి ఈప్రపంచంలో మరొకరు ఉండరు అంటూ కామెంట్స్ చేసాడు. 


అంతేకాదు ఒక గొప్ప మానవతావాది అంటూ కామెంట్స్ చేస్తూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. ఇదే సందర్భంలో యంగ్ హీరో నిఖిల్ తన పై చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ అసలు నిఖిల్ అనే హీరో ఇండస్ట్రీలో ఉన్నాడా అంటూ ఒక జోక్ చేసాడు. ఇక తన ట్రైలర్ లో త్రివిక్రమ్ ను పోలిన వ్యక్తి పాత్ర ఫై స్పందిస్తూ తన సినిమాలోని ఆపాత్ర లుక్ త్రివిక్రమ్ లా ఉంది కానీ అది త్రివిక్రమ్ కాదు అంటూ తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుసుకాని మాటల మాంత్రికుడు ఎవరో తెలియదు అంటూ మరొక సెటైర్ పేల్చాడు. 


ఇది ఇలా ఉండగా నిఖిల్ రామ్ గోపాల్ వర్మని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మోరిగినా..ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు మీకు అర్థం అయ్యిందిగా’ అంటూ నిఖిల్ చేసిన కామెంట్స్ కు సోషల్ మీడియాలో 30 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఉండేవాళ్ళంత ఒక భానిసత్వానికి చెందిన వాళ్ళు అంటూ వర్మ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ తో వాతావరణం మరింత వేడెక్కి పవర్ స్టార్ మూవీ విడుదలను ఏవిధంగా పవన్ ఫ్యాన్స్ అడ్డుకుంటారు అన్న విషయమై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది..     

మరింత సమాచారం తెలుసుకోండి: