దీనితో ఈ మూవీ షూటింగ్ నిమిత్తం మరో ఏడాది పాటు చరణ్ జూనియర్ లు రాజమౌళి వద్ద బందిగా ఉండటం ఖాయం అన్నసంకేతాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్తలు వైరల్ కావడంతో చరణ్ జూనియర్ లతో పాటు వీరిద్దరిని నమ్ముకుని సినిమాలు తీస్తున్న కొరటాల త్రివిక్రమ్ లు తెగ మధన పడుతున్నట్లు టాక్.
‘ఆచార్య’ లో చరణ్ తో ఒక ప్రత్యేక పాత్రను చేయించడం కోసం కొరటాల శివ గత ఏడాదిగా ఎదురు చూస్తున్నాడు. అదేవిధంగా ఎన్టీఆర్ తో తన కొత్త మూవీ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేయించుకున్న త్రివిక్రమ్ కూడ తారక్ కోసం మరో సంవత్సరం ఎదురు చూడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మార్కెట్ పరంగా ఈ ఇద్దరి దర్శకుల మార్కెట్ వేల్యూ కూడ 100 కోట్లు పైనే ఉంటుంది. దీనితో త్రివిక్రమ్ కొరటాలతో పాటు చరణ్ జూనియర్ లు ఇలా ఈ నలుగురు కెరియర్ ‘ఆర్ ఆర్ ఆర్’ తో ముడిపడి ఉండటంతో ప్రస్తుతం ఈ నలుగురు ఏమి చేయాలో తెలియక తీవ్ర అంతర్మధనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే రాజమౌళి తన కరోనా వైరస్ నుండి తేరుకుని ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ షూటింగ్ ను డిసెంబర్ లోపు ప్రారంభించడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అన్న కోణంలో కూడ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జక్కన్న ధైర్యం చెపుతున్నా ఎంత వరకు చరణ్ జూనియర్ లు రాజమౌళి ఇస్తున్న ధైర్యానికి ఎంతవరకు స్పందిస్తారు అన్న విషయం ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి