పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన గొప్ప వ్యక్తిత్వాన్ని సోషల్
మీడియా ద్వారా నిరూపించుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినబడితే చాలు ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత వినబడుతుంది.
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ సెపరేట్ క్రేజ్ ను ఏర్పరుచుకున్నాడు.తాను పెద్ద
సూపర్ స్టార్ అయ్యుండి కూడా అందరి పట్ల గౌరవం మరియు కృతజ్ఞత ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ నిన్న తన 49వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు బెస్ట్ విషెష్ తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకున్నారు. నిన్న వందల మంది సెలెబ్రిటీలు
పవన్ కి బర్త్ డే విషెష్ చెప్పగా, నేడు రోజంతా సమయం కేటాయించి, వారికి బదులు ఇచ్చారు.
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అప్ కమింగ్ హీరోలు, దర్శకులతో పాటు అందరికీ పేరుపేరున ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. అది కూడా మర్యాద పూర్వక సంభోదనతో ఆయన రిప్లై ఇవ్వడం కొందరిని సంబ్రమాశ్చర్యాలకు గురి చేసింది. యంగ్
హీరో కార్తికేయ అయితే
పవన్ రిప్లై కి షాక్ అయ్యారు. కార్తికేయను
పవన్ సార్ అని సంభోదించడంతో ..మీకున్న కోట్లమంది ఫ్యాన్స్ లో నేను ఒకడిని, మీరు నన్ను సార్ అనడం ఏమిటీ సార్ అని ట్వీట్ చేశారు.
ఏదిఏమైనా
పవన్ అలా అందరికీ రిప్లై ఇవ్వడం ఆయనపై మరింత గౌరవాన్ని పెంచింది. ఇక నిన్న
పవన్ ఫ్యాన్స్ ని వరుస అప్డేట్స్ తో ఆనందంలో ముంచెత్తారు. వకీల్ సాబ్ మోషన్
పోస్టర్ తో పాటు, క్రిష్,
హరీష్ శంకర్ మూవీల ప్రీలుక్స్, సురేంధర్ రెడ్డితో కొత్త
మూవీ ప్రకటన
పవన్ చేయడం జరిగింది.