హీరో నాగార్జున తన డ్రీమ్ మూవి ‘మనం’ సినిమా పబ్లిసిటి చాల వెరైటీగా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రీ అక్కినేని గురించి పలు ఆశక్తికర విషయాలు మాట్లాడాడు. అక్కినేని తన పిల్లలను స్నేహితులులా చూసుకునేవాడని వివరిస్తూ తాను తన తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక స్నేహితుడు అడిగినట్లుగా డ్రింక్ చేస్తావా అని అరమరికలు లేకుండా అడిగేవారని తన తండ్రి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు నాగార్జున. ఇదే సందర్భంలో మాట్లాడుతూ తన తండ్రితో నటించినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి వీలు కలిగిందని అయితే అక్కినేని ఆఖరి చిత్రం ‘మనం’ లో నటిస్తున్నప్పుడు మాత్రం తన గురించి ఏమాత్రం పట్టించు కోకుండా తన ద్రుష్టి అంతా నాగచైతన్య పైనే పెట్టి సలహాలు ఇస్తూ ఉంటే తనకు ఎంతో కోపం వచ్చిందని ఆ విషయం తన తండ్రిని అడుగుదామన్నా అడగలేక పోయానని బహుశా తను తన తండ్రికి బోర్ కొట్టి ఉంటానేమో అంటు ‘మనం’ సినిమా గురించి తన భావాలను పంచుకున్నాడు నాగార్జున. విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు, అక్కినేని కుటుంబ అభిమానులతో పాటు నాగార్జున కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: