కొన్నేళ్ల క్రితం నుండి టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణవంశీ మంచి పేరుని దక్కించుకుని కొనసాగుతున్నారు. వాస్తవానికి తన కెరీర్ మొదటిలో ఎన్నో గొప్ప సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన కృష్ణవంశీ, ఇటీవల మాత్రం ఆశించిన రేంజ్ సక్సెస్ లు మాత్రం అందుకోలేకపోతున్నారని అంటున్నారు విశ్లేషకులు. కొన్నాళ్ల క్రితం ఆయన తీసిన పైసా, మహాత్మ, నక్షత్రం, గోవిందుడు అందరివాడేలే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే.  

ఇక ప్రస్తుతం రంగమార్తాండ అనే డ్రామా బ్యాక్ డ్రాప్ మూవీ ని తీస్తున్న కృష్ణ వంశీ, అతి త్వరలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో తన నెక్స్ట్ మూవీ తీయనున్నారు అనేది కొన్ని ఫిలిం నగర్ వర్గాల టాక్. వాస్తవానికి కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్ తో బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కృష్ణవంశీ తీసిన గోవిందుడు అందరివాడేలే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది. మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్న ఈ సినిమా ఒక్కసారిగా ఫెయిల్ అవడంతో అది కొంతవరకు రామ్ చరణ్ కెరీర్ పై కూడా ప్రభావం చూపించిందని, కాగా ఆ విధంగా తనకు భారీ ఫ్లాప్ ని ఇచ్చినప్పటికీ కూడా మరొక్కసారి కృష్ణవంశీతో సినిమా చేయడానికి చరణ్ సిద్ధమయ్యారని అంటున్నారు.  

ఇటీవల ఒకానొక సందర్భంలో కృష్ణవంశీని కలిసిన చరణ్, ఆ సమయంలో ఆయన చెప్పిన ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ఎంతో నచ్చడంతో ఎట్టిపరిస్థితుల్లో ఆ సినిమాని వదులుకోకూడదని నిశ్చయించారట. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో దానిని చేయడానికి సిద్దమయిన చరణ్, ప్రస్తుతం తాను నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం దానిని పట్టాలెక్కించేలా ప్లాన్స్ చేస్తున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావలసిందే అంటున్నారు విశ్లేషకులు .....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: