బుల్లితెరపై ఎన్ని టాప్ షోలు ఉన్నప్పటికీ అవన్నీ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తరువాతే అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే బుల్లితెరపై ఎన్ని షోలు ఉన్నప్పటికీ ఒక్క సారి బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది అంటే చాలు అని పక్కకు తప్పుకోవలసిందే. ఇక గత కొన్ని వారాల క్రితం ప్రారంభమైన బిగ్బాస్ తెలుగు సీజన్ 4  బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంతగానో ఆకర్షిస్తుందన్న  విషయం తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరి కన్ను  బిగ్బాస్ హౌస్  పైన ఉంది. అయితే బిగ్ బాస్ షో అంతలా హిట్ కావడానికి కారణం తమకు తెలిసిన సెలబ్రిటీలకు సంబంధించి తమకు తెలియని కొత్త విషయాలను తెలియచెప్పడమే.


 సినిమాల్లో కాకుండా నిజజీవితంలో సెలబ్రిటీలు ఎలా మాట్లాడుతారు ఎలా ఉంటారు  అనే విషయాలను బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులు చూస్తూ ఎంతో ఆకర్షితులవుతున్నారు. అయితే ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు సీజన్ 4 లో  ట్రయాంగిల్ ప్రేమకథలు ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. అఖిల్ మోనాల్... అభిజిత్ హారిక... అవినాష్ హర్యానా... ఇలా  బిగ్ బాస్ హౌస్ లో పలు రకాల లవ్ స్టోరీస్ ఉన్నాయి అని బిగ్బాస్ కెమెరాలు  ప్రేక్షకులకు చూపిస్తున్న తరుణంలో ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ మరింతగా ఆకర్షితులు అవుతుండటం గమనార్హం.



 అయితే ప్రస్తుతం బిగ్ బాస్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటుంది ఎవరు అన్నది అందరిలో నెలకొన్న ప్రశ్న. గ్లామర్ పరంగా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్న  గుజరాతి బ్యూటీ మోనాల్  ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటుందట. ఇక బిగ్బాస్ కెమెరాలు కూడా మోనాల్  ఎక్కువగా క్లోజప్ లో చూపిస్తున్నాయి. అయితే తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నటించిన సుడిగాడు, బ్రదర్ అఫ్ బొమ్మాలి అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలో  వచ్చిన క్రేజ్ కంటే ప్రస్తుతం బిగ్ బాస్ లో వస్తున్న క్రేజ్  ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో మోనాల్ కి  ఎక్కువగా పారితోషకం చెల్లిస్తున్నారని.. వారానికి 8 లక్షల పారితోషకం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: