దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ రేప్ అండ్ మర్డర్ కేసును ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాగా తీస్తున్నాడు. యథార్థ సంఘటనల నేప‌థ్యంలో సినిమాలు తెర‌కెక్కించ‌డంలో దిట్ట రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇప్ప‌టికే ప‌లు రాజ‌కీయ‌, క్రైం అంశాల‌ని వెండితెరపై చిత్రీకరిస్తున్నా సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రణయ్ అమృతాల యదార్ధ జీవితం ఆధారంగా చేసుకొని సినిమాను చిత్రీకరించాడు. ఈ సినిమాపై ప్రణయ్ కుటుంబ సభ్యులు కోర్టుని ఆశ్రయించారు. తాజాగా అదే కోణంలో దిశా తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని ఎన్ కౌంటర్ చేశారు. మరోవైపు దిశ ఘటన ఉందంతంతో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి 'దిశ ఎన్ కౌంటర్' అనే పేరు పెట్టారు. అయితే ఈ సినిమాను ఆపాలంటూ దిశా తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దిశా ఘటనను ఆధారంగా చేసుకుని సినిమా తీయవద్దని, దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సినిమాను ఆపేలా తగు చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో దిశా తండ్రి పిటిషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ సినిమాపై సెన్సార్ బోర్డుకు పిటిషనర్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కేంద్ర ప్రభుత్వం తరపు సొలిసిటర్‌ జనరల్ హైకోర్టుకు తెలిపారు.

అయితే ఈ సినిమాను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దింతో మరోసారి ఆపేయాలంటూ దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.  సినిమాను ఆపేయాలంటూ తన పిటిషన్ లో శ్రీధర్ రెడ్డి కోరారు. ఇప్పటికే రిలీజ్ టీజర్ పై సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారని సీసీఎస్ లో కూడా శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నీచమైన మెస్సేజ్ లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: