బిగ్ బాస్ సీజన్ 4లో ఈ శుక్రవారం రేస్ టూ ఫినాలే టాస్క్ మొదలైంది. ఈ సీజన్ మొత్తం లో బెస్ట్ అండ్ వరస్ట్ కెప్టెన్ ల గురించి చెప్పమని బిగ్ బాస్ చెప్పాడు. అయితే అరియానా కెప్టెన్సీలో తను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు సోహెల్. ఆమె మాత్రం తన కెప్టెన్సీలో అందరు అన్ని రూల్స్ పాటించేలా చేశానని అన్నది. ఇక సోహెల్ తన కెప్టెన్సీ గురించి సోలోగా విన్ అయ్యాను కెప్టెన్ గా బాగా చేశానని చెప్పగా అఖిల్ అందుకుని ఇక్కడ అందరు సోలోగానే ఆడుతున్నాడని అంటాడు.

ఇక మరోసారి అఖిల్, అభిజిత్ ల మధ్య ఈ బెస్ట్, వరస్ట్ కెప్టెన్ టాస్క్ లో గొడవ జరుగుతుంది. దాన్ని ఆపేందుకు సోహెల్ తన ప్రయత్నం చేస్తున్నాడు. అఖిల్ సోహెల్ మీద అరుస్తున్నాడు. మొత్తానికి ఈరోజు రేస్ టూ ఫినాలే టికెట్ లో బెస్ట్, వరస్ట్ లను ఎంపిక చేసి వారికి టికెట్ టూ ఫినాలే టాస్క్ పెట్టి అందులో గెలిచిన వారికి ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ ఇస్తారని చెప్పొచ్చు. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఎవరు బెస్ట్ కెప్టెన్, ఎవరు వరస్ట్ కెప్టెన్ అని హౌజ్ మేట్స్ అందరు ఓ నిర్ణయానికి వస్తారో చూడాలి.

హౌజ్ లో ఉన్న ఏడుగురికి ఏడు రకాల అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ చెప్పే దాని ప్రకారంగా ఈ రేస్ టూ ఫినాలే టాస్క్ జరుగుతుందని చెప్పొచ్చు. మరి ఇంతకీ ఈరోజు ఆ బెస్ట్, వరస్ట్ కెప్టెన్స్ గా ఎవరు సెలెక్ట్ అవుతారన్నది చూడాలి.                             



మరింత సమాచారం తెలుసుకోండి: