బిగ్ బాస్ లో వచ్చినప్పుడు పరిచయం లేని వ్యక్తులుగా వచ్చి ఇక్కడకు వచ్చాక స్నేహితులుగా మారడం కామన్. అయితే ఏ సీజన్ లో చూడని విధంగా బిగ్ బాస్ సీజన్ 4లో సోహెల్, అఖిల్ ల స్నేహం ఉంది. ఒకరి కోసం ఒకరు ఆట ఆడటం.. ఒకరి కోసం ఒకరు శాక్రిఫైజ్ చేయడం కనబడుతుంది. ఇక్కడ సోలోగా ఆడాలన్న పాయింట్ మర్చిపోయినట్టు కనిపిస్తున్నా వారిద్దరి బాండింగ్ అలా కుదిరింది అని చెప్పుకుంటున్నారు.

సరే అలానే అనుకుని టాప్ 3 వరకు.. వచ్చి అభిజిత్ ను కూడా వీరి స్నేహంతో వెనక్కి నెట్టేసి టాప్ 2లో స్టేజ్ మీద అఖిల్, సోహెల్ ఇద్దరు ఉండి నాగార్జున ఒక్కరిని విజేత ఎనౌన్స్ చేయాలంటే అప్పుడు ఈ లెక్కలన్ని ఎలా ఉంటాయి. అయితే తను లేదంటే తిను.. అయితే అక్కడ వారు చేసేది ఏమి ఉండదు. ఇన్నాళ్లు ఫ్రెండ్ షిప్ సూపర్ గా చేసినా అక్కడ తమకు నచ్చిన కంటెస్టంట్ కే విన్నర్ గా అవకాశం ఇస్తారు.

సోహెల్, అఖిల్ ల వ్యవహారం చూస్తుంటే విజేతగా మీ ఇద్దరిలో ఒకరు తేల్చుకోండి అంటే ఒకరి కోసం మరొకరు త్యాగం చేసేలా ఉన్నారు. స్నేహం పరంగా ఇది ఓకే కాని ఇన్ని రోజులు కష్టపడ్డది ఈ టైటిల్ కోసమే కదా అక్కడైనా సరే తమకు తాముగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడిదాకా ఎందుకు టికెట్ టు ఫినాలే లో ఫైనల్ రౌండ్ వరకు సోహెల్, అఖిల్ ఉండేలా ఉన్నారు. మరి ఆ టైం లో పెట్టే టాస్క్ లో ఎవరు త్యాగం చేస్తారు.. ఎవరు ఫైనల్ వరకు వెళ్తారో చూడాలి.                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: