టాలీవుడ్ లో ప్రేమలు, పెళ్లిళ్లు సర్వసాదరణం. ప్రేమ ఎంత త్వరగా పుడుతుందో, అంతే త్వరగా బ్రేకప్ చెప్పుకుంటారు. మరి సినిమా సెట్స్ పై ప్రేమలో పడి, పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకున్న 10  జంటలు ఏవో ఒకసారి చూద్దాం.

సుమంత్ : అక్కినేని నటవారసుడు సుమంత్  హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఏడాదిలోపే విడాకులు ఇచ్చాడు.
కమల్ హాసన్ : ఇక కమల్ మూడు సార్లు ప్రేమలో పడి పెళ్లి చేసుకొని మూడు సార్లు విడిపోయాడు.  మొదట ప్రముఖ డ్యాన్సర్ వాణి గణపతిని, తర్వాత హీరోయిన్ సారిక మరియు నటి గౌతమితో బ్రేకప్ చేసుకున్నాడు.
రాధికా : హీరోయిన్ రాధికా దర్శకుడు ప్రతాప్ కె పోతన్ తో ప్రేమలో పడి సంవత్సరం తిరగకుండానే విడాకుల బాట పట్టారు.
లిజి : ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ హీరోయిన్ లిజి షూటింగ్ లొకేషన్లో ప్రేమలో పడి పాతికేళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తున్నారు.
రమాప్రభ: తనకన్నా వయసులో చాల చిన్నవాడైన నటుడు శరత్ కుమార్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని పదేళ్లు కాపురం చేసి విడాకులు తీసుకున్నారు.
ఊర్వశి: నటి ఊర్వశి, సినిమాల్లో నటిస్తున్న క్రమంలో సింగర్ అయినా మనోజ్ కె జయన్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని, మద్యం కారణంగా విడాకులు తీసుకున్నారు.
రోహిణి :  హీరోయిన్ రోహిణి, నటుడు రఘువరన్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక కొడుకు పుట్టాక, రఘువరన్ డ్రగ్స్ కి బానిస కావడం తో విడాకులు తీసుకుంది.
అమల పాల్: దర్శకుడు విజయ్ ని సినిమా లొకేషన్ లో ప్రేమించి పెళ్లి చేసుకొని ఏడాది తిరగకుండానే విడాకులు తీసుకుంది.
సోనియా:  అమల పాల్ దారిలోనే దర్శకుడు సెల్వరాఘవన్ ని ప్రేమిచి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది.
శారదా: నటుడు చలం ని పెళ్లి చేసుకున్న శారదా, అతడి టార్చర్ భరించలేక విడిపోయి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
పవన్ కళ్యాణ్: హీరోయిన్ రేణు ని రెండో పెళ్లి చేసుకున్న కమల్ ఎనిమిదేళ్ల సహజీవనం, మూడేళ్ళ కాపురం తర్వాత విడాకులు తీసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: