కాజల్ పెళ్లికి ముందు కమిటైన చిరు ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలతో పాటుగా కోలీవుడ్ లో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాల తర్వాత కూడా కాజల్ మునుపటి లానే అటు కమర్షియల్ ఇటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సై అంటుందట. అంతేకాదు ప్రత్యేకమైన సినిమాలు చేయాలని ఉత్సాహం చూపిస్తుందట కాజల్. కెరియర్ లో ఇంతకుముందు చేయని ప్రయోగాలు కూడా ఇప్పుడు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందట.
భర్త గౌతం నుండి కూడా ఎలాంటి కండీషన్స్ ఉండవని తెలుస్తుంది. సో కాజల్ కు పెళ్లయినా సరే సినిమాల్లో చెలరేగిపోవడం మాత్రం ఖాయమని అంటున్నారు. అయితే కాజల్ ఇన్ని సినిమాలు చేసినా విచ్చలవిడి అందాల ప్రదర్శన చేసింది లేదు. సో ఇప్పుడు కూడా అదే మెయింటైన్ చేస్తూ వరుస స్టార్ సినిమాలు చేసేయాలని చూస్తుంది అమ్మడు. కాజల్ ప్లానింగ్ అదిరింది కదా.. సమంత లానే పెళ్లి తర్వాత కాజల్ కూడా సత్తా చాటేలా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి