
ఇక కొన్ని అనధికారిక సోషల్ మీడియా మాధ్యమాలు అలానే ఓటింగ్ పోలీస్ ద్వారా మాకు అందుతున్న సమాచారాన్ని బట్టి చూసుకుంటే ఈ ఆఖరి వారం ఐదు రోజులు ఓటింగ్ ఫలితాలను బట్టి అందరికంటే ముందు స్థానంలో అభిజిత్ భారీ స్థాయిలో ఓటింగ్ దక్కించుకోగా ఆ తర్వాత రెండు, మూడు స్థానాలకు గాను అరియానా అలానే సోహెల్ ల మధ్య తీవ్రమైన పోటీ జరిగిందని ఆపై నాలుగు, ఐదు స్థానాల్లో అఖిల్ మరియు హారిక నిలిచారని అంటున్నారు. అయితే ఈ విషయం అనధికారికంగా అందుతున్న ఓటింగ్ పోల్స్ యొక్క సమాచారం కావడంతో స్టార్ మా వారి వద్ద ఉండే ఫలితాలు ఒకింత వేరుగా ఉండే అవకాశం కూడా లేకపోలేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఓటింగ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారమవుతుంది.
అదేమిటంటే ఈ తాజా బిగ్ బాస్ 4 సీజన్ లో ఏకంగా 20 కోట్లు కోట్లు ఓట్లు నమోదు అయ్యాయని ఇప్పటి వరకు జరిగినటువంటి మూడు సీజన్స్ లో కూడా ఇంతటి భారీ స్థాయి ఓటింగ్ అయితే జరగలేదని ఒకరకంగా ఇది అతి పెద్ద రికార్డ్ అని పలువురు అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం వైరల్ అవుతోంది. మరి ఈ తాజా సీజన్ లో విన్నర్ గా ఎవరు గెలుస్తారో రన్నర్ గా ఎవరు నిలుస్తారో తెలియాలంటే మరొక రోజు వరకు వెయిట్ చేయక తప్పదు......!!