నాన్న
సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయి, నటనతో ప్రేక్షకులను కన్నీరు తెప్పించిన బాలనటి వెన్నెల. ఆమె అసలు పేరు
సారా అర్జున్. 2011లో
తమిళ్ లో "దైవ తిరుమగల్ " అనే పేరుతో విడుదలైన ఈ
సినిమా తెలుగులో"
నాన్న "పేరుతో
రీమేక్ చేయబడ్డది. ఈ సినిమాకు ఏఎల్
విజయ్ దర్శకత్వం వహించగా,డాక్టర్ మల్ల విజయప్రసాద్,సంతోషం
సురేష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
విక్రమ్ హీరో ,అనుష్క
హీరోయిన్ గా నటించారు. ఇందులో
సారా అర్జున్,విక్రమ్ కూతురుగా నటించింది. మెదడు ఇంకా ఎదగని ఒక
తండ్రి తన కూతురు తో ఎలా ప్రవర్తించాడు అనే అంశంపై ఈ
సినిమా కొనసాగుతుంది.
విక్రమ్,
సారా అర్జున్ ల మధ్య జరిగిన సంఘటనలు చూసి ఇప్పటికీ ప్రేక్షకుల కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఇంతటి గొప్ప నటనతో ప్రేక్షకుల మదిలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంది
సారా అర్జున్.
పూర్తి వివరాల్లోకి వెళితే
సారా ప్రముఖ విలక్షణ నటుడు
రాజ్ అర్జున్ ఒక్కగానొక్క కూతురు.
రాజ్ అర్జున్ తెలుగు, తమిళంతో పాటు
హిందీ సినిమాల్లో కూడా నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.తన కూతురు సారాని చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రోత్సహించి,
నాన్న సినిమాలో
విక్రమ్ కి కూతురుగా అవకాశం రావడంతో సారాను వెండితెరకు పరిచయం చేశాడు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన తన బాల్య జీవితం ఎన్నో భారీ విజయాలతో మొదలై తెలుగు,తమిళంతో పాటు
హిందీ సినిమాల్లో కూడా నటించింది.
సారా తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించి
విజయ్ అవార్డుతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా తన కైవసం చేసుకుంది.దాగుడుమూత దండాకోర్ సినిమాలో
రాజేంద్ర ప్రసాద్ గారికి మనవరాలుగా ఎంతో క్యూట్ గా నటించింది. అలా మొదలైన తన జీవితం ఇప్పుడు ఒక స్టార్
హీరోయిన్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను తెచ్చుకుంది.
2019లో
తమిళ్ లో వచ్చిన "సిల్లు కురుపట్టి "అనే చిత్రంతో
హీరోయిన్ గా
సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది.నలుగురు ప్రేమకథగా వచ్చిన ఈ
లవ్ స్టోరీ అత్యంత భారీ విజయాన్ని చేకూర్చింది.ఈ
సినిమా తరువాత ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం "పొన్నియం సెల్వం" లో కూడా ఒక
హీరోయిన్ గా ఈమె నటిస్తోంది. ఈ సినిమాలో
విక్రమ్,కార్తీ,జయం
రవి హీరోలుగా నటిస్తుండగా,త్రిష,శోభితా ధూళిపాళ లాంటి గొప్ప హీరోయిన్లతో పాటు
సారా అర్జున్ నటించబోతున్నారు. ఇక సీఎంగా అందాల నటి
ఐశ్వర్య రాయ్ విలన్ గా నటిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం ఎన్నో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.