కార్తీక దీపం సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ హిట్ అయ్యిందో మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు .. అందులో నటించే ప్రతి ఒక్కరు చాలా ఫేమస్ అయ్యారు .. దీప పాత్ర నుండి శౌర్య వరకు ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది .. ఇక కార్తీక దీపం సిరీస్ ద్వారా మా టీవీ టిఆర్పి రేటింగ్స్ ఒకరేంజ్ లో పెరిగాయి .. .. ఇక కార్తీక దీపం లోని నటులను ఒకసారి పరిశీలిస్తే డాక్టర్ కార్తీక్ పాత్రలో నిరుపమ్, దీప పాత్రలో లో మలయాళీ నటి ప్రేమి విశ్వనాధ్ నటించారు .. ఇక ఈ  సీరియల్ లో చేసిన మరో బలమైన పాత్ర గురించి మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ లో మాట్లాడబోతున్నాం ..  ఆ పాత్ర లేనిదే కార్తీక దీపం సీరియల్ ఈ రేంజ్ లో హిట్ అయ్యేదే కాదు .. అపాత్ర మరేదో కాదు దీప కి అత్తగారిలా చేసిన సౌందర్య పాత్ర .. అటు దీపకి అత్తగా మరియు కార్తీక్ కి తల్లి బాలన్స్ చేస్తూ అద్భుతంగా నటించడంతో సౌందర్య పాత్ర బాగా క్లిక్ అయ్యింది .. ఆమె నటనకి రెండు రాష్ట్రాల ప్రజల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి .. మరి అంతటి పవర్ ఫుల్ పాత్రలో నటించిన సౌందర్య గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం ..

కార్తీక దీపం లో సౌందర్య అని పిలువబడే నటి యొక్క అసలు పేరు అర్చన అనంత్ ఈమె ప్రస్తుతం స్టార్ మా లో వస్తున్నా ‘కేరాఫ్‌ అనసూయ అనే మరొక సీరియల్ లో మంచి పాత్రలో నటిస్తున్నారు .. ఇక అత్తగా అంత వయసున్న పాత్రలో నటించిన అర్చన వయసు గురించి  మీకు తెలిస్తే నిజంగా  ఆశ్చర్య పోతారు .. అర్చన అనంత్ గారి వయసు కేవలం 33 సంవత్సరాలేనట. అవునండీ ఇదే నిజం .. అయితే అర్చన నటిగా కావాలని అనుకోలేదట తాను ఫ్యాషన్ డిజైనర్ కావాలని అనుకుందట .. తన కంటూ జీవితం లో ఒక గుర్తింపు పొందాలని బాగా కష్టపడేదని అయితే అదృష్టం కొద్దీ తాను నటిగా మారి ఇప్పుడు ఎంతోమంది ప్రజల చేత శబాష్ అనిపించుకుంటుంది ..

అయితే ఇటీవల ఒక మీడియా తో మాట్లాడుతూ కొన్ని విషయాలను బయట పెట్టింది .. ఫ్యాషన్ డిజైనర్‌గా చేస్తున్న సమయం లో తన స్నేహితులు తనలోని కలని చూసి ఒక కన్నడ సినిమా కోసం ఆడిషన్ ఇవ్వమని కోరారని .. ఆలా వాళ్ళు అడగడంతో నేనెను ఆడిషన్ ఇచ్చాను .. కానీ ఉహించని విధంగా నేను అందులో సెలెక్ట్ అయ్యాను .. ఇక నా తొలి పాత్ర ఎంత విచిత్రమైనదంటే నాకు వచ్చిన తొలి అవకాశం లోనే మరణించిన శవం లాగా  పడుకునే పాత్ర చేసానని చెప్పుకొచ్చింది .. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ తో తెలుగు ప్రజలు నా పట్ల చూపుతున్న ఆదరాభిమానాలు మర్చిపో లేనివని సంతోషం వ్యక్తం చేస్తుంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: