
కరోనా నుండి తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోలుకున్నారు .. ఈ మేరకు ట్విట్టర్ లో తనకి నెగటివ్ వచ్చినట్లు ఒక పోస్ట్ ని పెట్టారు .. ఇది చుసిన మెగా ఫాన్స్ సంతోషిస్తున్నారు .. అయితే గత నెలలో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ రాగా అప్పటినుంచి అయన హోమ్ క్వారంటైన్‌లోనే ఉన్నారు.. మళ్ళీ ఈరోజు అయన టెస్ట్ చేయించుకోగా నెగటివ్ రిపోర్ట్ రావడం నిజంగా సంతోషించదగ్గ విషయం .. ఇక రామ్ చరణ్ ఈరోజు కరోనా నుంచి కోలుకోగా . ఐదు రోజుల కిందటే వరుణ్ తేజ్ కరోనా నుంచి సురక్షితంగా కోలుకున్నారు ..అయన కోలుకున్న విషయాన్నీ వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు .. ఇద్దరు మెగా హీరోలు భయంకరమైన వైరస్ నుంచి సురక్షితంగా బయటపడడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు .. ఇక రాంచరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న rrr లో నటిస్తున్నారు .. కరోనా నుంచి కోలుకున్న రామ్ చరణ్ రేపో మాపో సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొంటారని తెలుస్తుంది ..
ఇక కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది సినీ ప్రముఖులు మరణించిన విషయం మనకి తెలిసిందే .. అంతేమంది సినీ ప్రముఖులు కరోనా భారీన పడి సురక్షితంగా బయటపడడం చూస్తే కరోనా వైరస్ ప్రభావం మునుపటిలాగా లేనట్లే కనిపిస్తుంది .. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి .. కరోనా నుండి కోలుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.. ఇక రానున్న రోజుల్లో ఆ సంఖ్య అలాగే కొనసాగితే తెలంగాణ రాష్ట్రం కరోనా రహిత రాష్ట్రంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి..