మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ జనవరి 19 మంగళవారం వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ కెరియర్ లో 10వ సినిమాగా వస్తున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన టైటిల్ గురించి కొన్నాళ్లుగా మీడియాలో డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి.

బాక్సర్ టైటిల్ ను పెట్టాలని అనుకున్నా ఆ టైటిల్ ఇప్పటికే బాగా ప్రచారం జరగడంతో అది కాకుండా వేరే టైటిల్ పెడితే ఆడియెన్స్ షాక్ అవుతారని ఈ సినిమాకు కొత్త టైటిల్ ఫిక్స్ చేశారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు గని అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. రేపు రిలీజ్ చేసే పోస్టర్ కూడా అదే అని తెలుస్తుంది. గని పాత్రలో వరుణ్ తేజ్ బాక్సర్ గా అదరగొడతాడని అంటున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ లైగర్ తో బాక్సింగ్ నేపథ్యంతోనే సినిమా చేస్తున్నాడు.

విజయ్ లైగర్.. వరుణ్ తేజ్ గని రెండిటికి స్టోరీ వేరే అయినా సినిమాలో ఇద్దరు హీరోలు బాక్సింగ్ చేయడం ఖాయమని తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ్ గని టైటిల్ తో పాటుగా మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారట. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడి బాక్సింగ్ నేర్చుకున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: