రామ్ చరణ్ తన ‘గోవిందుడు అందరివాడేలే’ గురించి దసరాపండుగ అయిపోయినా కూడా కలెక్షన్స్ స్థాయిని నిలబెట్టడానికి ఛానల్స్ లో రకరకాల ఇంటర్వ్యూలు ఇస్తూ ఈసినిమా పై ఆశక్తిని పెంచుతూ కలెక్షన్స్ ను పెంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు సుకుమార్ గురించి ఆయన కూడా ఊహించుకోని కామెంట్స్ చేసి సుకుమార్ కు జోష్ ను ఇచ్చాడు.
ఆ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న యాంకర్ చరణ్ భవిష్యత్తులో చేయబోయే సినిమాల గురించి మాట్లాడుతూ రాబోతున్న కాలంలో సుకుమార్ లాంటి వెరైటీ దర్శకుల సినిమాలలో నటిస్తారా అని చరణ్ ను అడిగిన ప్రశ్నకు చరణ్ ఇచ్చిన సమాధానం నిజంగానే సుకుమార్ కు షాకింగ్ గా మారుతుంది.
తాను సుకుమార్ తీసిన ‘1 నేనొక్కడినే’ చూసానానీ అటువంటి వెరైటీ సినిమాలలో తనకు నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది అంటూ షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు రామ్ చరణ్. ఇదే సందర్భంలో మాట్లాడుతూ సుకుమార్ లాంటి వెరైటీ సినిమాలు తీయగలిగిన దర్శకులు ఎవరైనా మంచి స్క్రిప్ట్ తో తన వద్దకు వస్తే తాను వారిని ప్రోత్సహిస్తాను అని అనడమే కాకుండా రానున్న కాలంలో అన్నీ కలిసి వస్తే తనకు సుకుమార్ తో సినిమా చేయాలని కూడా ఉందని అంటూ ఇప్పుడు మాత్రం అది ఎప్పుడు అంటే మాత్రం చెప్పలేననీ తెలివిగా సమాధానం ఇచ్చాడు చరణ్.
ఈ సమాధానాలను బట్టి ‘గోవిందుడు అందరివాడేలే’ సక్సస్ చరణ్ ఆలోచనలను అలాగే అతడి మైండ్ సెట్ ను బాగా మార్చేసింది అని అనుకోవాలి...
మరింత సమాచారం తెలుసుకోండి: