‘ఐ’ ఆడియో లాంచ్ కోసం ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన విక్రమ్ తన ఆరోగ్య విషయంలో ఈమధ్య మీడియాలో వచ్చిన వార్తలను ఖండించడమే కాకుండా తాను ఈసినిమాలో నటించిన మూడు పాత్రల కోసం ఎంత కష్ట పడ్డాడో ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు. ఈసినిమాలో తానూ నటించిన మూడు పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయని వివరిస్తూ ఈసినిమాలోని ఒక పాత్ర కోసం శరీరం బరువు తగ్గేందుకు చాలా స్ట్రిక్ట్ డైట్ పాటించానని అయితే వెంటనే మరో పాత్ర కోసం బరువు పెరగాల్సి వచ్చిందని అక్కడే తనకు అనుకోని ఆరోగ్య సమస్యలు వచ్చాయి అన్నాడు విక్రమ్.  ఒక్కసారిగా బరువు తగ్గడం మళ్ళిపెరగడం విషయంలో తన డాక్టర్లు కుడా ఖంగారు పడ్డారని అని అంటూ ముఖ్యంగా సన్న బడేందుకు ఎనిమిది నెలలపాటు ఖచ్చితమైన ఆహార నియమాలు పాటించానని చెప్పాడు ఈ విలక్షణ నటుడు. ఈ సందర్భంలోనే ఒక దశలో తన భార్య ఆందోళన చెంది ఇక చాలు. ఈ స్ట్రిక్ట్ డైట్ మానేయమని టెన్షన్ పడిందని అయితే తాను ఆమె మాటలు కూడా లెక్కచేయలేదని అన్నాడు.  అయితే దర్శకుడు శంకర్ ఈసినిమాలోని తన పాత్ర కోసం ఇంతగా కష్టపడ నక్కరలేదని గ్రాఫిక్స్‌తో నడిపించేద్దామని చెప్పినా అ మాటలు తన మనసు అంగీకరించలేదు అన్నాడు. ఇక ఈ సినిమాలో తన మానవ మృగo గెటప్ మేకప్ కు ఐదు గంటలు పట్టేది అని చెపుతూ మళ్ళి ఆ మేకప్ తీసివేయడానికి రెండు గంటలు పట్టేది అని అంటూ ఇంత కష్టపడ్డ తన ప్రయత్నానికి ప్రేక్షకులు ఎటువంటి రిజల్ట్ ఇస్తారో అని ఆశక్తి గా ఈ సినిమా విడుదల అవుతున్న సంక్రాంతి తేది కోసం రోజులు లెక్క పెడుతున్నాని నవ్వుతూ చెప్పాడు విక్రమ్.  మరి రాబోతున్నసంక్రాతి రేస్ లో తెలుగు ప్రేక్షకులు పవన్ విక్రమ్ ల మధ్య ఎవరిని విజీతలుగా నిర్ణయిస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: