అప్పట్లో రాజమౌళి ఈ విషయమై స్పందిస్తూ శ్రీదేవి శివగామి పాత్రకు ఒప్పుకుని చేసి ఉంటే రమ్యకృష్ణ లాంటి అద్భుతమైన నటిని మిస్ అయి ఉండే వాడిని అంటూ ఒక ఇంటర్వ్యూలో అప్పట్లో కామెంట్స్ చేశాడు. దీనిపై శ్రీదేవి భర్త బోనీకపూర్ ఆరోజులలో చాల ఘాటుగా స్పందించాడు. ఇది అంతా అప్పటి చరిత్ర ఆనాటి నుండి బోనీకపూర్ రాజమౌళి ల మధ్య ఒక గ్యాప్ కొనసాగుతూనే ఉంది.
ఇప్పుడు మళ్ళీ ఆ గ్యాప్ మరింత పెరిగే సందర్భం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ వల్ల ఏర్పడిందా అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. దీనికి కారణం బోనీకపూర్ రాజమౌళి ల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ అక్టోబర్ 13న విడుదల కావడం బోనీకపూర్ కు ఏమాత్రం ఇష్టంలేదు. ఈయన నిర్మాణ సంస్థలో నిర్మింపబడ్డ అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ‘మైదాన్’ మూవీ కూడ అదే డేట్ కు విడుదల అవుతోంది.
ఈ విషయం తెలిసి ఉండి కూడ రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ ను ‘మైదాన్’ మూవీని పట్టించుకోకుండా అక్టోబర్ 13న విడుదల చేయడం బోనీకపూర్ కు తీవ్ర అసహనాన్ని కల్గించింది. ఈ రెండు సినిమాలలోను కీలక పాత్రలలో అజయ్ దేవగన్ నటిస్తున్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ ను అదే డేట్ కు ఎందుకు విడుదల చేస్తున్నారు అని బోనీకపూర్ రాజమౌళిని అడిగితే అతడు తెలివిగా సమాధానం ఇచ్చినట్లు టాక్. తాను ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి కేవలం దర్శకుడుని మాత్రమే అనీ మూవీ రిలీజ్ విషయం నిశ్చయించేది నిర్మాత డిస్ట్రిబ్యూటర్లు అని రాజమౌళి చెప్పిన సమాధానానికి బోనీకపూర్ తీవ్ర అసహనంలో ఉన్నాడని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి