
బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ఈమె.. మొదటి నుండి తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. ఒకానొక టైములో ఈమె టైటిల్ విన్నర్ అవుతుందని అంత భావించారు కానీ కాస్త లో మిస్ అయ్యింది. ఇదిలాఉండగా తనను ఇంతగా పాపులర్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ను కలిసింది. ఈ మేరకు వర్మ తో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తనకోసం సమయం కేటాయించినందుకు వర్మకి కృతజ్ఞతలు తెలిపింది.
ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో కలిసి హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది అరియానా.. ఆ మధ్య దీనికి సంబంధించిన ఫొటోలను సైతం షేర్ చేసి అభిమానులను సంతోష పెట్టింది. బిగ్ బాస్ తర్వాత అరియానా సూపర్ బిజీ అయిపోయింది. వర్మ కూడా ఆమెతో సినిమా చేసినా చేస్తాడని తెలుస్తుంది.