ఇప్పుడు మరో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సినిమాల లో నటించడానికి రెడీ అవుతున్నారు. విషయానికొస్తే.. ఎప్పుడు కనపడకుండా తెర వెనక ఉండి, సినిమాకు మంచి మ్యూజిక్ ను అందిస్తున్న ఏ.ఆర్.రెహమాన్ తొలిసారి కెమెరా ముందుకొచ్చారు. త్వరలోనే తనలోని నటుడ్ని ప్రేక్షకులకి పరిచయం చేయనున్నారు. మలయాళ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా బి. ఉన్ని కృష్ణన్ తెరకెక్కిస్తోన్న 'ఆరాట్టు' చిత్రం లో నటిస్తున్నారు రెహమాన్..ఈ సినిమాలో ఆయన గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.
ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తాజాగా అభిమానుల తో పంచుకున్నారు మోహన్ లాల్. ఈ మేరకు సెట్లో రెహమాన్, దర్శకుడి తో దిగిన ఫొటో ను షేర్ చేశారు. 'అరుదైన, ఎప్పటికీ గుర్తుండి పోయే షూట్ ఇది' అని పేర్కొన్నారు. యాక్షన్ కామెడీ నేపథ్యం లో రూపొందుతున్న ఈ సినిమా లో శ్రద్ధా శ్రీనాథ్ నాయిక. హిప్పో ప్రైమ్ మోషన్ పిక్చర్స్, మూవీ పే మీడియాస్ ఆర్డీ ఇల్యుమినేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ మధ్యనే వచ్చిన తమిళ చిత్రం 'బిగిల్' లోని ఓ పాట లో ఆయన కన్పించారు. ఎప్పుడు తన మ్యూజిక్ తో అలరించే ఈయన ఇప్పుడు నటన తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి..