కరోనా సెకండ్ వేవ్ తారా స్థాయికి చేరిపోవడంతో అందరికీ భయాలు పెరిగి పోతున్నాయి. ప్రజా ప్రతినిధులు సెలెబ్రెటీలు ఆఖరికీ చుట్టాలు కూడ ఎవరు ఎవర్ని తమ ఇళ్ళకు రావద్దనీ ఏ అవసరాలు ఉన్నా ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ ఆన్ లైన్ ద్వారా టచ్ లో ఉండమని సంకేతాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


సాధారణ పరిస్థితులలో కూడ ఎవర్నీ పెద్దగా కలవడానికి ఇష్టపడని మహేష్ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు అని టాక్. మహేష్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయబోతున్న మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఎగ్రిమెంట్ పేపర్లను కూడ మహేష్ ఆన్ లైన్ లోనే తెప్పించుకుని వాటిని ఓకె చేసి ఆన్ లైన్ లోనే సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయవలసిన మూవీ రద్దు అవ్వడంతో వెంటనే త్రివిక్రమ్ మహేష్ ను లైన్ లో పెట్టడం ఈమూవీకి ఓకె చేయించుకోవడం జరిగింది. అయితే అన్ని ఫైనల్ అయిన తరువాత ఈమూవీకి సంబంధించిన ఎగ్రిమెంట్ పేపర్లను ఈ మూవీ నిర్మాతలు మహేష్ సంతకం కోసం ఇంటికి తీసుకు వస్తాము అని చెపితే ప్రస్తుతం కొనసాగుతున్న సెకెండ్ వేవ్ రీత్యా ఇలా కలవడం ఎవరికీ మంచిది కాదనీ ఎగ్రిమెంట్ పేపర్లను ఆన్ లైన్ లో పంపితే మంచిదని మహేష్ సున్నితంగా చెప్పడంతో ఈమూవీ ఎగ్రిమెంట్ వ్యవహారాలు అన్నీ మహేష్ ఆన్ లైన్ లోనే పనులు అన్నీ పూర్తి చేసాడు అన్న వార్తలు వస్తున్నాయి.


ఇది ఇలా ఉండగా ఈమూవీకి సంబంధించిన వివరాలు అన్నింటినీ త్రివిక్రమ్ త్వరలో ప్రకటిస్తాడని టాక్. ఈమూవీకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. మొదట్లో ఈమూవీలో హీరోయిన్ గా రష్మిక పూజ భట్ ల పేర్లు వినిపించినా అలియా భట్ ఈమూవీలో నటిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలతో ప్రస్తుతం ఆమెతో రాయబారాలు నడుపుతున్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: