పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల విషయంలో కాస్త కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో సినిమా కలెక్షన్లు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు ఇది తెలుగు రీమేక్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ ఇతర కీలక పాత్రల్లో నటించారు.


 
అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటి అంటే ఈ సినిమా పవన్ కంటే ముందు నందమూరి బాలకృష్ణ వద్దకు వెళ్లిందట. కథంతా విన్నాక తాను చేయలేనని ఆయన చెబితే అప్పుడు ఈ సినిమా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళింది అని తెలుస్తోంది. బాలకృష్ణ కాదన్నాక ఆ విషయం త్రివిక్రమ్ కి తెలిసిందట.. త్రివిక్రమ్ కి కథ బాగా నచ్చడంతో ఇది పవన్ కళ్యాణ్ కి అయితే సరిగ్గా సూట్ అవుతుందని భావించి ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది.



ఇక ఆ తరువాత సినిమా రూపొందటం, రిలీజ్ కావడం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలవడం తెలిసిందే. అలా బాలకృష్ణ కాదు అనుకున్న సినిమా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి సూపర్ హిట్ గా నిలిచింది అన్నమాట. ఇక ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ మరో నాలుగు సినిమాలు ఒప్పుకున్నారు. అందులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళం సినిమా రీమేక్ షూటింగ్ దశలో ఉన్నాయి. హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: