తెలుగు వాళ్లకు సినిమా అంటే మహా పిచ్చి. హీరోలంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. హీరోలను దేవుడిలా ఆరాధించడాన్ని ఇక్కడ మాత్రమే చూస్తుంటాం. అదిరే స్టెప్పులతో, తూటాల్లాంటి డైలాగులతో ఉర్రుతలూగించే తెలుగు హీరోలకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఈ మధ్య కలెక్షన్స్ తో పాటు ఇలా ట్విట్టర్ లో ట్రెండ్ సృష్టించడం కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది.  


ఇక ఒక రోజు మొత్తం మీద ట్విట్టర్లో ఎవరి సత్తా ఏంటో అనేదానిమీద తాజాగా జరిగిన ఒక ట్విట్టర్ మెన్షన్ వార్ లో మహేష్ బాబు అందరి కంటే ఎక్కువ మెన్షన్స్ తో టాప్ లో నిలిచాడు. మహేష్ బాబు కు 225.4కే రాగా జూనియర్ ఎన్టీఆర్ కి 166.8కే తర్వాత పవన్ కళ్యాణ్ కి 160.9కె రామ్ చరణ్ కి 138.9కె ఇక అల్లు అర్జున్ కి 58.7కే మెన్షన్స్ వచ్చాయి. 

ట్విట్టర్ ఫాలోవర్స్ విషయంలో అందరి కంటే ముందు వరుసలో ఉన్న మహేష్ బాబు 11.4 మిలియన్ ఫాలోవర్స్ తో ముందు వరుసలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో అల్లు అర్జున్ నిలిచాడు. ఆయనకు 5.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తర్వాతి స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఐదు మిలియన్ వ్యూస్ తో మూడో స్థానంలో నిలిచారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 4.5 మిలియన్ ఫాలోవర్స్ తో నాలుగో స్థానంలో నిలిచారు. ఇక రామ్ చరణ్ 1.3 మిలియన్ ఫాలోవర్స్ తో ఈ జాబితాలో ఐదో స్థానానికి పరిమితం అయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: