సీనియర్ హీరోలలో బాలకృష్ణ తీరు చాల విభిన్నం. అప్పుడప్పుడు బాలయ్యకు కోపం వచ్చినా ఎటువంటి ఇగోలు లేకుండా ఎవరితో అయినా సద్దుకుపోయే మనస్తత్వం బాలకృష్ణ సొంతం. తాను నటించే సినిమా బడ్జెట్ విషయంలో కాని హీరోయిన్ విషయంలో కానీ బాలయ్యకు ఎలాంటి పట్టింపులు పెట్టుకోడు. అదేవిధంగా తాను నటించే మూవీ ప్రమోషన్ విషయంలో కూడ నిర్మాతలతో భారీ ఖర్చులు పెట్టించడు.

ఇప్పుడు ఈ విషయమే బాలకృష్ణకు అదృష్టంగా కలిసి వచ్చింది అంటున్నారు. యంగ్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని అనీల్ రావిపూడి లాంటి దర్శకులతో పాటు మరికొంతమంది యంగ్ డైరెక్టర్ లు బాలకృష్ణతో మూవీ చేయడానికి ఆశక్తి కనపరుస్తున్నట్లు టాక్. మహేష్ ప్రభాస్ చరణ్ జూనియర్ అల్లు అర్జున్ లకు కథ చెప్పి ఒప్పించడం కంటే బాలయ్యకు కథ చెప్పి ఒప్పించడం సులువు అన్న అభిప్రాయంలో ఇప్పుడు చాలామంది యంగ్ డైరెక్టర్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనికితోడు బాలయ్య ఒక మూవీ ప్రాజెక్ట్ ను ఒప్పుకున్న తరువాత ప్రతి చిన్న విషయంలోను కలగచేసుకోడని దర్శకుడుకి పూర్తి స్వేచ్చ ఇస్తాడని అంటారు. అదే యంగ్ హీరోలు అయితే దర్శకులను ప్రతి చిన్న విషయంలోను టెన్షన్ పెడుతూ కథలో అనేక మార్పులు చేర్పులు వారే సూచిస్తారని ఇలాంటి అలవాటు బాలయ్యకు లేకపోవడంతో అనేకమంది యంగ్ డైరెక్టర్స్ బాలయ్య బాట పడుతున్నారు అన్న మాటలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి బాలయ్య మార్కెట్ ఏమాత్రం బాగా లేనప్పటికీ ‘అఖండ’ టీజర్ కు వచ్చిన అనూహ్య స్పందనతో అనేకమంది యంగ్ డైరెక్టర్స్ బాలయ్య గురించి ఆలోచనలు చేసేలా చేస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘అఖండ’ బ్లాక్ బష్టర్ హిట్ కాకపోయినా ఆతరువాత వచ్చే గోపీచంద్ మలినేని అనీల్ రావిపూడిల సినిమాలతో బాలయ్య కెరియర్ గ్రాఫ్ మళ్ళీ పెరిగి టాప్ హీరోలతో మోడరేట్ బడ్జెట్ తో సినిమాలు తీయాలి అని ఆరాట పడుతున్న నిర్మాతలకు చిరునామాగా బాలయ్య మారిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు..  




మరింత సమాచారం తెలుసుకోండి: