
తెలుగు
సినిమా ఇండస్ట్రీ ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. కొంతమంది ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని మంచి స్థాయిలో కొనసాగుతున్నారు. మరికొంతమంది నటీనటులు కావొచ్చు లేదా టెక్నీషియన్స్ కావొచ్చు కొద్ది కాలం తరువాత వివిధ కారణాల వలన ఇండస్ట్రీకి దూరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎంతోమంది అతి తక్కువ వయసులోనే
హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వస్తారు. వారిలో అందరూ
సక్సెస్ కారు. అలాగని అందరూ ఫెయిల్ అవ్వరు. వారు ఎంచుకునే కథలను బట్టి వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. స్టార్ డం వచ్చింది కదా అని అన్ని కథలను ఒప్పుకుని సినిమాలు చేస్తూ పోతే వారు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగలేరు. సినీ
ఇండస్ట్రీ లోకి తక్కువ వయసులో హీరోగా వచ్చి
సక్సెస్ ఫుల్ గా కెరీర్ లో దూసుకుపోతున్న
హీరో నితిన్. నితిన్ తన
సినిమా జీవితాన్ని 19 సంవత్సరాల వయసులోనే హీరోగా ప్రారంభించాడు. ప్రముఖ
డైరెక్టర్ తేజ తెరకెక్కించిన జయం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. ఈ
సినిమా 2002 లో విడుదలయి మంచి ప్రేమకథా చిత్రంగా విజయాన్ని సాధించింది. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్.

మొదటి సినిమానే హిట్ కావడంతో తరువాత
సినిమా మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ తో చేసే అవకాశాన్ని పొందాడు. "దిల్" అనే పేరుతో 2003 లో వచ్చి స్టూడెంట్ పవర్ ఏమిటో చూపించింది. ఇది కూడా సూపర్ హిట్ అయింది. తరువాత వరుసగా "సంబరం" మరియు "శ్రీ ఆంజనేయం" సినిమాలు నితిన్ హిట్ ట్రాక్ కు అడ్డు తగిలాయి. మళ్లీ 2004 లో
ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన "సై"
సినిమా ఒక సంచలనంగా మారింది. ఈ సినిమాతో
నితిన్ కి మంచి పేరు వచ్చింది. అంతటితో
నితిన్ కెరీర్ లో హిట్ సినిమాలు రావడం ఆగిపోయాయి. దాదాపుగా ఆరు సంవత్సరాలు పాటు నితిన్ కి చెప్పుకునే హిట్
సినిమా రాలేదు. వేరే
హీరో ఎవరైనా అయితే
ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పేవాడు. కానీ
నితిన్ తండ్రి సుధాకర్
రెడ్డి సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడం వలన
నితిన్ ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. 2011 లో
విక్రమ్ కె
కుమార్ దర్శకత్వంలో వచ్చిన "ఇష్క్" సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు నితిన్. ఈ సినిమా
నితిన్ కు సాలిడ్ హిట్ ఇచ్చింది. ఆ తరువాత సంవత్సరమే ఇంకో హిట్ వచ్చింది.

ఈ సారి విజయ్
కుమార్ కొండ అనే నూతన దర్శకుడితో "గుండె జారి గల్లంతయ్యిందే" మూవీతో మంచి మ్యూజికల్ హిట్ అందుకున్నాడు. ఇలా మళ్లీ 2014 లో ఊర
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన "హార్ట్ ఎటాక్"
మూవీ పరాజయం పాలయ్యింది. మళ్లీ వరుసగా రెండు సినిమాలు "చిన్నదాన నీకోసం" మరియు "కొరియర్ బాయ్ కళ్యాణ్" లు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలో విఫలమయ్యాయి. తెలుగు
సినిమా మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన "అ ఆ'" తో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత వచ్చిన "లై", "చల్
మోహన్ రంగ", "శ్రీనివాస కల్యాణం", "రంగ్ దే" మరియు "చెక్" సినిమాలు నితిన్ ను తీవ్రంగా నిరాశపరిచాయి. నితిన్ కి లాస్ట్ హిట్
వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ సినిమాతో వచ్చిందే కావడం విశేషం. ప్రస్తుతం నితిన్
హిందీ సూపర్ హిట్
మూవీ "అందాధున్" కి
రీమేక్ గా "మేస్ట్రో" చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని
మేర్లపాక గాంధీ అనే
యువ దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. 19 సంవత్సరాల
నితిన్ సుదీర్ఘ
సినిమా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ప్లాప్ వచ్చినా వెనుతిరిగి చూడలేదు. ప్రేక్షకులపై ఎంతో నమ్మకంతో మంచి కథలను తీస్తే తప్పక ఆదరిస్తారని నిరూపించాడు. ఈ సినీ మార్గంలో పలు హిట్ లను సొంతం చేసుకున్నాడు. నితిన్ మొత్తం 19 సంవత్సరాలలో 27 చిత్రాల్లో నటించాడు. ఇంకా ముందు ముందు మరెన్నో మంచి చిత్రాలతో మముందుకు రావాలని ఆశిద్దాం. హ్యాపీ 19 ఇయర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ...నితిన్ గారు.
