లేడీ అమితాబ్.. విజయశాంతి.. నటిగా , నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం , హిందీ చిత్రాల్లో దాదాపు 180 సినిమాలకు పైగా నటించి, లేడీ అమితాబ్ , ది లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. విజయశాంతి మొదటిసారి బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. విజయశాంతి వరంగల్ జిల్లాలో జన్మించినప్పటికీ, మద్రాసులో పెరిగింది. ఇక ఆమె పిన్ని విజయలలిత కూడా మంచి నటి. ఇక ఈమె ప్రోత్సాహంతోనే , తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వంలో1979లో కల్లుక్కుల్ ఈరమ్ అనే తమిళ సినిమా ద్వారా మొట్టమొదటిసారిగా హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఇక మొదటి సారిగా 1979లో కిలాడి కృష్ణుడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇక 1991లో కర్తవ్యం సినిమా ద్వారా ఈమెకు జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకుంది. అంతేకాదు ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డ్ లతో పాటు ఆరు సార్లు ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత నాలుగు రాష్ట్రాల నంది అవార్డులతో పాటు దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం అందుకోవడం విశేషం. ఇక కర్తవ్యం సినిమా ద్వారా స్టార్ హీరోలైన బాలకృష్ణ ,చిరంజీవిలకు కూడా గట్టి పోటీ ఇచ్చి, ముచ్చెమటలు పట్టించింది. ఇక అంతే కాదు 1990లలో హీరోలతో సమానంగా పారితోషకం అందుకున్న ఏకైక నటిగా గుర్తింపు పొందింది. కర్తవ్యం సినిమాకు ఈమె అందుకున్న పారితోషకం అక్షరాల కోటి రూపాయలు. 1987లో దగ్గుబాటి పురందేశ్వరి మేనల్లుడైన శ్రీనివాస్ ప్రసాద్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇక 1979 న మొదలై 2006 వరకు హీరోయిన్ గా తన జీవిత సినీ ప్రస్థానాన్ని విజయవంతం చేసుకుంది. 1998లో రాజకీయ ప్రవేశం చేసింది. 2006 లో చివరిసారిగా హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన జమానత్ సినిమాలో నటించింది. ఇక దాదాపు 13 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి తెలుగులో 2020లో మహేష్ బాబు నటించిన సూపర్ డూపర్ హిట్ సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటించడం విశేషం. ఇక ఈ సినిమాలో కాలేజీ లెక్చరర్ గా రీ ఎంట్రీ ఇచ్చి అందరి చేత మన్ననలు పొందింది విజయశాంతి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి