1988 లో ఆమె ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ అయిన శిరీష్ గోడ్‌బొలెను వివాహం చేసుకుని అమెరికాకు వెళ్లింది. తర్వాత కొంతకాలం యునైటెడ్ కింగ్‌డమ్లో లో నివాసం ఉన్నారు. ఇక ఈ దంపతులకు 1996లో ఆడపిల్లకు జన్మనిచ్చారు. పెద్ద కుమార్తె పేరు సనమ్. నదియా మళ్ళీ ఐదేళ్ల తర్వాత రెండో అమ్మాయి జానా కు జన్మనిచ్చింది. ఇద్దరు కూతుళ్లు తల్లి అయినా ఇప్పటికీ నదియా అందంకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
నదియా మళ్ళీ 2004లో తమిళ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఆమె తెలుగులో 2013 లో ప్రభాస్ అమ్మగా మిర్చి సినిమాతో పునః ప్రవేశం చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కు మేనత్తగా నటించారు. ఆ తరువాత అఆ , దృశ్యం వంటి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు
ప్రస్తుతం టాలీవుడ్ లో వరస హిట్స్ సినిమాల్లో నటించిన నదియా గోల్డ్ లెగ్ అనే నమ్మకాన్ని సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం భారీ పారితోషకాన్ని అందుకుంటుంది. ఇక ఇండస్ట్రీలో నదియా మోడ్రెన్ అత్తగా చలామణి అవుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. ఇతర ఇండస్ట్రీలోను వరుస అవకాశాలతో బిజీగా మారిపోయింది. ఇక అత్తారింటికి దారేది సినిమాకు 2013 నంది పురస్కారాలులో ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి