ఎప్పటిలాగే ఇప్పుడు కూడా మా అసోసియేషన్ ఎన్నికలు ఎంతో ఆసక్తిని సంతరించు కున్నాయి. కాకపోతే గతంలోలా విమర్శలు బహిరంగంగా చేసుకోవడం మాత్రం జరగట్లేదు. గత ఎన్నికల సమయంలో శివాజీ రాజా మరియు నరేష్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడగా ఇప్పటికీ అది చల్లార లేదు అని తెలుస్తోంది. ఈసారి మా అసోసియేషన్ ఎన్నికలలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ , యంగ్ హీరో విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ లాంటి వారు బరిలో ఉన్నారు. వీరి నలుగురికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఈ నేపథ్యంలో వీరు బరిలో ఉన్న ఈ ఎన్నిక ఏమవుతుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.

ఇప్పటివరకు తన సినిమాల విషయంలో తప్ప ఇండస్ట్రీలోని అంశాలపైన పెద్దగా ఫోకస్ విష్ణు ఇప్పుడు మా అధ్యక్ష పదవికి పోటీ పడడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు గా హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇటీవలే మోసగాళ్లు అనే భారీ బడ్జెట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫలితం ఎలా ఉన్నా నటుడిగా మంచి పేరు దక్కింది విష్ణు కి. యంగ్ హీరో అయిన విష్ణు హేమాహేమీలైన ప్రకాష్ రాజ్ , జీవిత రాజశేఖర్, హేమ లాంటి వారితో పోటీ పడుతున్నాడు మరి వీరి నుంచి పోటీని తట్టుకొని ఏ మాత్రం నిలబడగలుగుతాడు అన్నది అసలు విషయం.

ప్రకాష్ రాజ్ సాధారణ రాజకీయాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. రాజకీయ నాయకుల పై విమర్శనాస్త్రాలు సంధిస్తు తాను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చాటి చెబుతూ ఉంటాడు. మహాసముద్రం లాంటి క్రియాశీల రాజకీయాల లో పండిపోయిన ప్రకాష్ రాజ్ కు మా అసోసియేషన్ ఎలక్షన్ అనేది పిల్లకాలువ లాంటిది. ఇతర పోటీ దారులైన జీవిత రాజశేఖర్, హేమ లు ఎంతో కొంత రాజకీయంలో ఓనమాలు దిద్దిన వారే. విష్ణు కూడా తన భార్య తరపు కుటుంబం నుంచి రాజకీయంగా కొన్ని విషయాలు తెలుసుకున్న వ్యక్తి. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్ ఎన్నిక ఎంతో ఆసక్తికరంగా మారింది. చిరంజీవి తమ్ముడు నాగబాబు ప్రకాష్ రాజు వైపు నిలవడంతో విష్ణు వైపు ఎవరు వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: