ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎన్నికల హోరు కొనసాగుతుంది. ఇక మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికల వేడి రోజురోజుకీ రాజుకుంటోంది. అయితే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా కొనసాగుతుంది. ఇక అధ్యక్ష రేసులో ఇప్పటికే ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్‌, హేమ ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం అధ్యక్ష బరితో తాము ఉన్నామంటూ సీనియర్‌ ఆర్టిస్ట్‌ సీవీఎల్‌ నరసింహారావు ప్రకటించారు.

అయితే ఇక బరిలో ఉన్న నటులకు సహా నటులు వారి మద్దత్తు ప్రకటిస్తున్నారు. ఇక ఇలాంటి తరుణంలో చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ మా ఎన్నికల కోసం రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? ఎవరికీ అందని ఈ ఊహను తన కామెడీ టైమింగ్‌ తో తెర మీదకు తీసుకొచ్చాడు సీనియర్‌ నటుడు బ్రహ్మాజీ. అయితే ఏం చేశారో ఒక్కసారి చూద్దామా.



ఇక చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్‌ నటుడు బ్రహ్మాజీకి ఏకంగా షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే కరోనా జాగ్రత్తతో మన నటుడు మర్యాదపూర్వకంగా ఆ షేక్‌హ్యాండ్‌ను తిరస్కరించి.. నమస్తే పెడుతుంటారు. ఇక పైగా ఆ ఫొటోలో జింగ్ పిన్‌ కనీసం మాస్క్‌ లేకుండా ఉన్నారు. ఇక దీనిని అఫ్‌కోర్స్‌.. అది జింగ్‌ పిన్‌ పాత ఫొటోనే అయినా ఎడిటింగ్‌ గమ్మత్తుతో భలేగా దానిని ప్రజెంట్‌ చేశారు బ్రహ్మాజీ.

అంతేకాదు.. ‘‘క్యాజువల్‌ మీట్‌.. ఎలాంటి రాజకీయాలు లేవు. కాకపోతే మా ఎన్నికల గురించి చర్చించామన్నారు. ఇక జింగ్‌ పిన్‌ కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలిపారు. ’అలాగే..’ అంటూ బ్రహ్మాజీ ఫన్నీ ఎమోజీతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అయితే తన తోటి నటులతో పాటు సమకాలీన విషయాలపై సెటైర్లు వేసే బ్రహ్మాజీ.. ఈమధ్యే తనకు భారీగా బంఫర్‌లాటరీ తగిలిందంటూ ‘ఫేక్‌ స్కాంకు సంబంధించిన ఒక అలర్ట్‌ మెసేజ్‌ను నెటిజన్స్‌ దృష్టికి తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిన విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: